తొలి టెస్టులో భారత్​ వెస్టిండీస్‌పై ఘన విజయం

తొలి టెస్టులో భారత్​  వెస్టిండీస్‌పై ఘన విజయం

* ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కెప్టెన్‌గా గిల్‌… రోహిత్‌, విరాట్​లకు స్థానం

అహ్మదాబాద్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 140 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 448/5 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. వెస్టిండీస్‌ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన వెస్టిండీస్‌ లంచ్‌ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 66/5గా ఉంది. 

లంచ్‌ అనంతరం భారత బౌలర్లు విజృంభించి మిగతా వికెట్లను తీశారు. టాగెనరైన్‌ చందర్‌పాల్‌ (14), జాన్‌ కాంప్‌బెల్‌ (8), అలిక్‌ అథానాజ్‌ (38), బ్రాండన్‌ కింగ్‌ (5), షారు హౌప్‌ (1), రోస్టన్‌ చేజ్‌ (1), జస్టిన్‌ గ్రీవ్స్‌ (25), జోమెల్‌ వారికన్‌ (0), ఖరీ పియర్‌ (13), జోహాన్‌ లేన్‌ (14), జేడెన్‌ సీల్స్‌ (22) పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 3, జడేజా 4, కుల్దీప్‌ 2, వాసిగ్టన్‌ సుందర్‌ 1 వికెట్‌ తీశారు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభంలో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 286 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162పరుగులకే పరిమితం చేసిన టీమిండియా అనంతరం భారత బ్యాటర్లు ముగ్గురు శతకాలతో రాణించడంతో 5వికెట్ల నష్టా నికి 448 పరుగులు చేసింది. కెఎల్‌ రాహుల్‌(100), జురెల్‌(125)కి తోడు జడేజా(104నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.  వెస్టిండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 2, జైడెన్‌ సీల్స్‌, జొమెల్‌ వారికన్‌, ఖేరీ పియెరీ తలో వికెట్‌ సాధించారు.

ఇలా ఉండగా, ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ-20టీ మ్యాచ్‌లు ఆడనుండగా, వన్డే జట్టుకు సారథిగా శుభ్‌మన్‌గిల్‌ను బీసీసీఐ నియమించింది. ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌శర్మ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌కు అవకాశం కల్పించింది. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ జట్టులో సీనియర్లు రోహిత్‌శర్మ, కోహ్లీకి చోటు దక్కింది.

శ్రేయాస్‌ అయ్యర్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలెక్షన్‌ కమిటీ వికెట్‌ కీపర్‌గా కేఎల్​ రాహుల్‌ను ఖరారుచేసింది. మరో కీపర్‌గా ధ్రువ్‌ జురేల్‌ను ఎంపిక చేసింది. అక్షర్‌ పటేల్, నితీశ్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ సిరాజ్, అర్షదీప్‌ సింగ్, యశస్వీ జైస్వాల్‌ వన్డే జట్టులో చోటుదక్కించుకున్నారు. వన్డేల్లో బూమ్రాకు విశ్రాంతినిచ్చారు.

కాగా, టీ-20 జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్‌ యాదవ్‌, వైస్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్‌కు మరోసారి అవకాశం దక్కింది. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, నితీశ్‌కుమార్‌రెడ్డి, శివమ్ దుబే, అక్షర్‌ పటేల్‌ వరుణ్ చక్రవర్తి, బూమ్రా, అర్షదీప్‌ సింగ్, కుల్దీప్‌ యాదవ్, హర్షిత్‌ రాణా, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్ టీ-20 జట్టులో ఉన్నారు. వికెట్‌ కీపర్లుగా జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఎంపికయ్యారు.