
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రత్యేకం.. 2
రాంపల్లి మల్లిఖార్జునరావు
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది-2
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరం సందర్భంగా సామాజికపరంగా పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యల పరిష్కారం కోసం స్వాభిమానం నిర్మాణం చేసినందుకు`పంచ పరివర్తన్’ ద్వారా ప్రయత్నం చేస్తున్నది. ఈ సందర్భంగా, 1. సామజిక సమరసత, 2. కుటుంబప్రబోధన్, 3. పర్యావరణం, స్వదేశీ, పౌరవిధులు గురించి సమాజంలో జాగరణ కలిగించేందుకు విశేషమైన కార్యక్రమాలు చేబడుతున్నది.
ఆ విధంగా స్వదేశీ భావాత్మకత భావుకత నిర్మాణం, పౌర విధులు ప్రత్యేకమైనవి. అవి ఒకపౌరుడిగా మన విధులు, పాటించవలసిన నియమాలను తెలియజేస్తుంది. అందులో మిగిలిన మూడు కూడా మనం చెప్పుకున్న గతివిధులు. ఆ దిశలో హిందూ సమాజంలోని వ్యక్తులు, కుటుంబాలు, వృత్తులు, గ్రామాలలోని ప్రజలు తన బాధ్యతలను, కర్తవ్యాలను నిర్వర్తించేందుకు సిద్ధం చేసే కృషి చేస్తున్నది. ఆ విధంగా హిందూ సమాజంలో పరివర్తన తీసుకురావడం ప్రధాన లక్ష్యం. ఈ రకంగా సమాజంలో పనిచేయటం అనేది పరంపరాగతంగా వస్తున్నటువంటి ఒక వ్యవస్థ మన దేశంలో ఉంది. ఇటువంటి వాటి గురించి భగవద్గీతలో మనందరికీ ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తుంది.
అధిష్టానం తథాకర్త
కరణంచ పృథగ్విధమ్
వివిధాశ్చ పృథక్ చేష్ట
దైవం చైవాత్ర పంచమం
కర్మల సిద్ధి ముందు అధిష్టానం అంటే భూమిక సిద్ధాంతం. అట్లాగే వివిధ రకాలైన సాధనాలు నానా విధములైన పనులు. వీటి కన్నిటికీ తోడు దైవ బలం. ఈ ఐదు ఒక సిద్ధాంత విజయానికి తోడ్పడుతాయని మనకు చెబుతుంది. రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ రకమైన పద్ధతిలో సమాజంలో పనిచేసుకుంటూ వస్తున్నది. గడిచిన వెయ్యి సంవత్సరాలుగా ఈ సమాజంఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకొంటూ వచ్చారు.
ఆ పనుల ద్వారా సమాజానికి ఒక దిశను చూపించిన వారు తులసీదాస్, రాణాప్రతాప్, సమర్థ రామదాసు, శివాజీ, విద్యారణ్యులవారు, విజయనగర సామ్రాజ్యం, రామకృష్ణ పరమహంస, వివేకానందులు. అట్లా సమాజంలో జరుగుతున్నా ప్రయత్నాలకన్నిటికి సమగ్ర రూపం సంఘంలో డాక్టర్జీ, గురూజీ రూపొందించి ఆ రూపాన్ని సాకారం చేస్తున్నారు. సంఘం ప్రణాళిక బద్ధంగా అనేక మైలురాళ్లను దాటుకుంటూ శతాబ్ది సంవత్సరంలో అడుగు పెట్టింది. ఒక్కొక్క మైలురాయి దాటిన తర్వాత సమీక్షలు చేయటం తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకోవడం సంఘం సహజంగానే చేస్తూ ఉంటుంది.
సంఘ్ మైలు రాళ్లు: 1. 1985లో సంఘం 60 సంవత్సరాల సందర్భం, 2. డాక్టర్జీ శత జయంతి, 3. సంఘం ప్రారంభించి 75 సంవత్సరాల సమయం, 4. గురూజీ శతజయంతి.
సంఘం మూడు అంచలలో పనులు చేస్తున్నది
- శాఖ ఆధారంగా వ్యక్తిని నిర్మాణం అంటే వ్యక్తి పరివర్తన మొదటి అంచు.
- శాఖలలో నిర్మాణమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో సమస్థల లో ప్రవేశించి పని చేస్తూ ఉంటారు. అంటే సామాజిక వ్యవస్థలలో సమాజానికి సంబంధించిన విలువలను నిర్మాణం చేసేందుకు పనులు చేసుకుంటూ వస్తారు. తద్వారా వ్యవస్థీకృతమైన హిందూ సమాజం నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. దీనిని వ్యవస్థ పరివర్తన అని అంటున్నాము.
- హిందూ సమాజంలో వ్యక్తులు కుటుంబాలుగా, వృత్తులుగా గ్రామాలలో, దేశంలో తమ బాధ్యతలను, తమ కర్తవ్యాలను నిర్వర్తించేందుకు సిద్ధం చేయాలి. అట్లా సామాజికపరంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మూడవ అంచు అని చెప్పవచ్చు.
అంతేకాకుండా సంఘం శతాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి జనసామాన్యాన్ని తట్టి లేపటం, ఉద్యమించటానికి సిద్ధం చేయటం సంఘ కార్యకర్తలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో భారతమాత గంగామాత రథయాత్ర, అయోధ్య రామ జన్మభూమి విముక్తి ఉద్యమం, స్వదేశీ భావ జాగరణ మొదలైన వాటిని చెప్పవచ్చు. సంఘం అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. సంఘం శతాబ్ది లో అడుగుపెట్టిన వేళ సామాజిక పరివర్తన ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించబోతోంది. ఈ రోజున ప్రపంచంలో అనేక రంగాలలో విప్లవాలు వచ్చాయి.
వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగం మొదలైన వాటిలో వచ్చాయి. ఇక మానవ జీవితాలను పునర్ నిర్మించేందుకు విలువలతో కూడిన ప్రపంచాన్ని నిర్మాణం చేసేందుకు ధార్మిక, ఆధ్యాత్మిక విప్లవం రావలసిన అవసరం ఉంది. ఆ దిశలో పనిచేయవలసిన అవసరం ఉంది. సంఘం ఈ రకంగా పనిచేస్తూ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ పనులన్నీ వంద సంవత్సరాల కాలంలో చేసింది. ఇంకా రాబోయే 20- 25 సంవత్సరాలలో సంఘం ఆశించిన పరమ వైభవ స్థితిలో ప్రవేశించడానికి సమయం పడుతుంది. కాబట్టి సంఘం ఆ దిశలో వేగంగా ముందుకు వెళ్ళుతుంది.
(ముగింపు)
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా