
ఛత్తీస్గఢ్లో తాజాగా బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 49 మంది మావోయిస్టులపై కోటి ఆరు లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో అనేకే మంది మరణించడంతో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫలితంగా ఒక్క దంతెవాడ జిల్లాలో గత 19 నెలల్లో 461 మందికి పైగా మావోయిస్టుులు లొంగిపోయారు. వారిలో 129 మంది తలలపై రివార్డులు కూడా ఉండడం గమనార్హం. ఇలా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కోసం ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది. అంతేకాదు వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుంది. వ్యవసాయ భూములను కూడా కేటాయిస్తుంది.
ఇప్పటికే అత్యధిక రివార్డు ఉన్న 9 మంది నక్సల్స్ను హతమార్చారు. దీంతో టాప్ కమాండర్ సుజాత ఇటీవలే లొంగిపోయారు. ఇప్పుడు (సెప్టెంబర్) బస్తర్ నక్సల్ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు ఆపరేషన్ విజయవంతం అయ్యింది. దంతెవాడలో ఏకంగా 71 మంది నక్సలైట్లు ఒకేసారి లొంగిపోయారు. వారందరూ లోన్ వరరతు (ఇంటికి తిరిగి రండి) ప్రచారం ప్రభావంతో లొంగిపోయమని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు రోడ్లు తవ్వడం, చెట్లు నరికివేయడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంచడం లాంటి అనేక ఘటనల్లో పాల్గొన్నారు. కొందరైతే పోలీసు స్టేషన్లపై, పోలీసులపై దాడి చేశారు కూడా! అయితే తాజాగా బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు అయితే ఇంకా చాలా మంది నక్సలైట్లు బస్తర్లో చురుకుగా ఉన్నారని సమాచారం.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం