
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జాతీయత మొదలైన అంశాలలో అద్భుతమైన నిబద్ధతను చూపిన ఆర్ఎస్ఎస్ పవిత్రమైన విజయదశమి రోజున వంద అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని తెలిపారు.
“ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సంఘ్‌కు 15 సంవత్సరాలకు పైగా నాయకత్వం వహించిన మోహన్ భగవత్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ప్రయాణం సనాతన ధర్మానికి సంబంధించిన విలువలపై సమాజాన్ని ఏకం చేయడంలో అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆయన నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ, దేశవ్యాప్తంగా సేవా స్ఫూర్తిని బలోపేతం చేస్తూనే ఉంది” అని పవన్ కొనియాడారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!