
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. “చిన్నపిల్లల దగ్గర నుంచి క్యాండీ దొంగిలించినట్లు, మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. బలహీనమైన, అసమర్థుడైనా కాలిఫోర్నియా గవర్నర్ వల్లే మన ఫిల్మ్ ఇండస్ట్రీ దెబ్బతింది. అందుకే ఈ దీర్ఘకాల, ఎప్పటికీ అంతంకానీ ఈ సమస్యను పరిష్కరించడానికి ఇకపై యూఎస్ వెలుపల నిర్మితమైన అన్ని సినిమాలపై 100 శాతం సుంకాలు విధిస్తాను” అని ట్రంప్ వెల్లడించారు.
విదేశీ సినిమాలపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్, కొద్ది సేపటికే ట్రూత్ సోషల్లో మరో పోస్టు పెట్టారు. అందులో విదేశాల్లో తయారై, అమెరికాకు వచ్చే ఫర్నీచర్పై కూడా భారీగా సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. “చైనా వల్ల, అలాగే ఇతర దేశాల వల్ల నార్త్ కరోలినా ఫర్నీచర్ వ్యాపారంలో పూర్తిగా దెబ్బతింది. అందుకే నార్త్ కరోలినాను మళ్లీ గొప్పగా మార్చడానికి, యూఎస్లో ఫర్నీచర్ చేయని ఏ దేశంపైన అయినా నేను భారీగా సుంకాలు విధిస్తాను” అని తెలిపారు.
ఒకప్పుడు అమెరికన్ చిత్రాలకు మారుపేరుగా హాలీవుడ్ ఉండేది. కానీ ఇటీవల అది ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలు, ఓటీటీలు వల్ల ప్రేక్షకులు సినిమా థియేటర్కు రావడం గణనీయంగా తగ్గింది. దీనితో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీనితో సినిమా నిర్మాణం కూడా బాగా తగ్గింది. దీనికి తోడు 2023, 2024లో రైటర్స్ గిల్డ్, కార్మిక సంఘాలు సమ్మెలు చేశాయి. ఇవి కూడా అమెరికన్ చిత్ర రంగానికి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించాయి.
ఒక అంచనా ప్రకారం 2023లో అమెరికా చిత్ర రంగానికి వచ్చిన నష్టం సుమారుగా 5 బిలియన్ డాలర్లు. పైగా సినిమా రంగంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికీ ఈ నష్టం భర్తీ కాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.త్వరలో కాంతార ఛాప్టర్-1 విడుదల కానుంది. క్రిష్ 4, కల్కి 2 లాంటి చాలా భారతీయ సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటికి తోడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్; మహేశ్ బాబు, రాజమోళి కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. అమెరికాలో వీటిని విడుదల చేసే ఆలోచనన్లో మేకర్స్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ కనుక విదేశీ చిత్రాలపై 100 శాతం సుంకాలు విధిస్తే, మన సినిమా పరిశ్రమకు ఆర్థికంగా ఇబ్బంది తప్పదు
More Stories
జనరల్ రైలు టికెట్కు ఆధార్ తప్పనిసరి
సెలబ్రిటీల రూ.కోట్ల విలువైన ఆస్తులను జప్తుకు సన్నాహాలు!
అండమాన్ సముద్రంలో భారీ సహజవాయువు నిక్షేపాలు