తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ రెండు ప్రపంచ గిన్నిస్‌ రికార్డ్‌లను సాధించింది. హైదరాబాద్లోని సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం అతి పెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా ఈ రికార్డులు సృష్టించింది. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 
63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. తీరొక్క పూలతో పూలతో పేర్చిన భారీ బతుకమ్మ చుట్టూ మహిళలందరు ఆడిపాడారు. మంత్రి సీతక్క బతుకమ్మపాట పాడి అలరించారు.  ఈ కార్యక్రమంలో ప్రపంచ సుందరి ఓపల్ సూచాత, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటామని సంతోస్తాం ప్రకటించారు. 
బతుకమ్మ అంటే విమలక్క, విమలక్క అంటే బతుకమ్మ అని కొనియాడారు. గఅడబిడ్డలు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరారు.  మంత్రి సీతక్క మాట్లాడుతూ గల్లి నుంచి గ్లోబల్ వరకు ఏదైనా సాధిస్తామని మహిళలు చాటారని తెలిపారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందడుగు వేస్తారని, రెండు నెలల కృషితో కార్యక్రమం విజయవంతమని వెల్లడించారు.

ఈ వేడుకలో ప్రపంచ సుందరి ఓపల్ సూచాత కూడా పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడింది. తెలంగాణ సంస్కృతి, సంబరాలు భిన్నంగా ఉంటుందని కొనియాడారు. స్వశక్తితో మహిళలు పైకి రావాలని ఆమె మహిళలను కోరారు.