
క్రియా యోగా ప్రాచీన బోధనలను పునరుద్ధరించిన, లాహిరి మహాశయునిగా ప్రసిద్ధి చెందిన శ్యామా చరణ్ లాహిరి (30 సెప్టెంబర్ 1828 – 26 సెప్టెంబర్ 1895) భారతీయ ఆధ్యాత్మిక గురువు, బాబాజీ శిష్యుడు, శ్రీ యుక్తేశ్వర్ గురువు. యోగావతారులు లాహిరీ మహాశయుల జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.
మనమధ్య అప్పుడప్పుడు, ప్రపంచం దృష్టికి కనిపించకుండా రాబోయే తరాలకు ప్రకాశమానమైన ఒక మార్గాన్ని సుగమం చేసే ఆధ్యాత్మిక మహనీయుడు నిశ్శబ్దంగా సంచరిస్తారు. అలాంటి మహనీయులలో సెప్టెంబర్ 30, 1828న బెంగాల్లోని ఘూర్ణిలో జన్మించిన లాహిరీ మహాశయులు ఒకరు.
ఈ సంఘటన చారిత్రాత్మకమైనది. శతాబ్దాలుగా, అటువంటి బోధనలు రక్షించబడి, సన్యాసులకు మాత్రమే ఇవ్వబడేవి. కానీ లాహిరీ మహాశయుల అభ్యర్థన మేరకు, ఈ పద్ధతిని నిజమైన దైవాన్వేషకులందరికీ ప్రసాదించవచ్చని బాబాజీ అంగీకరించారు. లాహిరీ మహాశయుల కార్యసాధన ప్రారంభమైంది.
వారి అనేక బోధనలలో, ఒక వాక్యం ప్రసిద్ధి చెందింది: “బనత్, బనత్, బన్ జాయ్” (“శ్రమిస్తూ, శ్రమిస్తూ, చూడు! అదిగో! దివ్యలక్ష్యం”). ఆధ్యాత్మిక మార్గంలో నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నారని నిరుత్సాహపడిన వారికి ఇది వారి సమాధానం. నిలకడైన, నిజాయితీతో కూడిన సాధన ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందనే ఆయన ప్రధాన సందేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
లాహిరీ మహాశయుల ప్రముఖ శిష్యులలో ఒకరు స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన వారు. తరువాత కాలంలో పరమహంస యోగానందకు గురువు అయ్యారు. యోగానంద విధిలో లాహిరీ మహాశయులు ఒక కీలక పాత్ర పోషించారు. యోగానంద చిన్న శిశువుగా ఉన్నప్పుడు, వారి తల్లి ఆ మహర్షి వద్దకు ఆశీర్వాదం కోసం తీసుకువెళ్ళింది.
ఆ ప్రవచనం నిజమైంది. యోగానందజీ ప్రపంచంలోనే గొప్ప క్రియాయోగ సాధకులయ్యారు. లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ ఆర్ ఎఫ్)ను, రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్)ను స్థాపించారు. ఈ సంస్థలు యోగావతారుల పరంపరలో, యోగానంద తన దివ్యగురువు పాదాల వద్ద నేర్చుకున్న బోధనలను ప్రచారం చేస్తాయి.
అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు వినయంగా నిగర్విగా ఉన్నారు. సేవా తత్వంతో కూడిన వారి ప్రశాంత జీవితం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, లౌకిక బాధ్యతల నిర్వహణ పరస్పరం వైరుధ్యాలు కావని చూపింది. సెప్టెంబర్ 30న లాహిరీ మహాశయుల జయంతిని పురస్కరించుకొని, కీర్తిని కోరకుండా ఆధ్యాత్మిక చరిత్ర గమనాన్ని మార్చిన ఒక గురువును మనం స్మరించుకుంటాము.
మరింత సమాచారం కోసం: yssofindia.org
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం