మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట

మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ( మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. పలు అంతర్జాతీయ వేదికలపై వీరు ఇరువురూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ అందరినీ ఆకర్షిస్తుంటారు.  తాజాగా వీరి మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది.  ‘ఐయామ్‌ జార్జియా-మై రూట్స్‌, మై ప్రిన్సిపల్స్‌’ పేరిట మెలోనీ ఆత్మకథ వ్రాసారు.
అందులో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలు, రాజకీయ, వ్యక్తిగత జీవితం, తల్లిదండ్రులు.. ఇలా తన జీవితంలో జరిగిన సంఘటనలను పొందుపరిచారు.  అంతేకాదు, తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా, సింగిల్‌ పేరెంట్‌గా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ ఆత్మకథ 2021లో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చి బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.
 
ఇటీవలే అమెరికాలో కూడా ఇది విడుదలైంది. ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు మెలోనీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో ఉన్న స్నేహబంధంతో ప్రధాని మోదీ మెలోనీ పుస్తకంలో ముందుమాట రాశారు. ఈ సందర్భంగా మెలోని ఆత్మకథను ‘హర్ మన్ కీ బాత్’ గా ప్రధాని అభివర్ణించారు.  ఈ పుస్తకంలో ముందుమాట రాయడం తనకు గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.
ఈ జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ కావడంతో ‘మెలోడీ’ మూమెంట్‌ మరోసారి తెరపైకి వచ్చింది.