
అక్టోబర్ 16న కర్నూల్, నంద్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల గురించి ప్రజలకు తెలియ చెప్పేందుకు దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఈ పర్యటన జరుపుతున్నది. ఈ సందర్భంగా కర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
ప్రధాని ఏపీ పర్యటనలో భాగంగా పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రస్తావించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ప్రధాని మోదీ జూన్ నెలలో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ 21న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు యోగాసనాలు వేశారు. ఆ కార్యక్రమం రికార్డ్ కూడా సాధించిన సంగతి తెలిసిందే.
జీఎస్టీ 2.0 నెక్ట్స్ జెన్ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు ప్రకటించారు. సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా జీఎస్టీ ఉత్తర్వులను తొలిసారి తెలుగులో ఈ వివరాలను తీసుకొచ్చిన్నట్లు తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలపై ఖర్చుల భారం తగ్గుతుందని, ప్రతి ఇంటికి, రైతులకు, విద్యార్థులకు లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.
More Stories
`సోషల్ మీడియా’ కేసుపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
ఏపీలో యోగ ప్రచార పరిషత్
తిరుమలలో క్యూలైన్ల నిర్వహణకు కమాండ్ కంట్రోల్ సెంటర్