గాజా వైపుకు అంతర్జాతీయ సహాయ దళం

గాజా వైపుకు అంతర్జాతీయ సహాయ దళం
అంతర్జాతీయ సహాయ దళం ఫ్లోటిల్లా గ్రీకు జలాలను వదిలి గాజా వైపు ప్రయాణిస్తుంది. గాజాలోకి నౌకల  ప్రవేశాన్ని ఏవిధంగానైనా అడ్డుకుంటామన్న ఇజ్రాయిల్‌ హెచ్చరికలను ధిక్కరిస్తూ ప్లోటిల్లా గ్రీకు జలాలను వీడి గాజా వైపు ప్రయాణిస్తోందని నిర్వాహకులు శుక్రవారం  పేర్కొన్నారు. తమ జలాల నుండి నావికాదళం సురక్షితంగా ప్రయాణించడానికి హామీ ఇస్తామని గ్రీస్‌ తెలిపింది. 

నౌకలు వచ్చేవారం ప్రారంభంలో చేరుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. అయితే గ్రీస్‌ నుండి బయలుదేరే కచ్చితమైన సమయం అస్పష్టంగా ఉందని తెలిపారు. శుక్రవారం ప్రధాన నౌకల్లో ఒకటి సాంకేతిక వైఫల్యానికి గురైందని, అది బయలుదేరేందుకు సిద్ధమవుతోందని నిర్వాహకులు తెలిపారు.

తాము మావనతాసాయం అందించడం మాత్రమే కాదు. ప్రపంచం పాలస్తీనాకు అండగా నిలుస్తుందనే బలమైన సందేశంతో పాటు నమ్మకం, సంఘీభావం అందించాలని తాము  కోరుకుంటున్నామని స్వీడన్ వాతావరణ కార్యకర్త  గ్రెటా థన్‌బర్గ్‌ పేర్కొన్నారు.  గ్రీస్‌ ద్వీపం క్రీట్‌ నుండి అంతర్జాతీయ సహాయం  ఫ్లోటిల్లా  డెక్‌ మీదుగా గురువారం ఆమె ఈ సందేశాన్ని పంపారు.

కాగా, మిషన్‌లో కొనసాగవద్దని ఫ్లోటిల్లాలోని తమ సభ్యులకు ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సందేశాన్ని పంపింది. గ్రీస్‌లో దిగాలని కోరుకుంటే వారు స్వదేశానికి తిరిగి పంపడంలో సహాయం అందిస్తామని పేర్కొంది. ఒకవేళ కొనసాగాలనుకుంటే ఎదురయ్యే ఇబ్బందులకు పూర్తి బాధ్యత వారిదేనని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

తాము మోహరించిన నావికాదళం నౌకలకు సముద్ర రక్షణ , మానవతా కార్యకలాపాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరిపైనైనా రక్షణాత్మక లేదా ప్రమాదకర సైనిక విన్యాసాల్లో పాల్గొనదని  సందేశంలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో బార్సిలోనా నుండి గ్లోబల్‌ సుముద్‌ ఫ్లోటిల్లా బయలుదేరింది. ఈ బృందంలో 51నౌకలు  ఉన్నాయి. 

స్వీడన్‌ వాతావరణ ప్రచారకర్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు సామాజిక కర్యాకర్తలు, న్యాయవాదులు, పార్లమెంట్‌ సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో నౌకలపై డ్రోన్ల దాడి జరిగిందన్న వార్త తర్వాత మధ్యధరా సముద్రం మీదుగా నౌకల ప్రయాణం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇటలీ , స్పెయిన్‌ తమ, ఇతర యూరోపియన్‌ పౌరులకు సాయం అందించేందుకు ఫ్లోటిల్లాలో నావికాదళ నౌకలను పంపాయి.