
గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బిజెపి గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని రామచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురుచూస్తున్నారని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.
బిజెపి మద్దతుతోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడిందని, నలబై ఏళ్ల పాటు పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చిన తెలంగాణను గత పదేళ్లపాటు నిలువునా ముంచిన పార్టీ బీఆర్‌ఆర్ అని ఆరోపించారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు ప్రత్యాన్మయంగా బిజెపికి పట్టం గట్టేందుకు సింసిద్దులవుతున్నారని, ఈ అవకాశాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాయని, గ్రూప్ వన్ పోస్టులను భర్తీచేయలని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జిఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, దీని వల్ల అన్నిసామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుండడం వల్లే రైతులకు యూరియా అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు.
30న ‘మేరా దేశ్ పహలే’
ప్రధాని నరేంద్ర మోదీ గారి జీవన ప్రయాణంపై ప్రత్యేకంగా రూపొందించిన ‘మేరా దేశ్ పహలే’ కల్చరల్ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన హైటెక్ సిటీలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతం రావు తెలిపారు. దాదాపు 10 వేల మంది పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించినట్లు వెల్లడించారు.
More Stories
పవన్ ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు రద్దు
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!