ఏపీ అభివృద్ధి రథానికి మాధవ్ “సారథ్యం”

ఏపీ అభివృద్ధి రథానికి మాధవ్ “సారథ్యం”
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్.


“సారథ్యం” విజయానికి మొదటి లక్షణం సారథ్యం.  ఓ దేశానికి అయినా, రాష్ట్రానికి అయినా, రాజకీయ పార్టీకి, అయినా చివరికి కుటుంబానికి అయినా  సమర్థవంతమైన సారథ్యమే విజయాన్ని తెచ్చిపెడుతుంది.  నరేంద్ర మోదీ సారథ్యం దేశానికి ఎన్నో అపురూప విజయాలను తెచ్చి పెట్టింది. ఏపీలో కూటమి పార్టీల సారథ్యంలో సమిష్టి కృషితో  అభివృద్ధి, జవాబుదారీతనం రాష్ట్రానికి మంచి భవిష్యత్ ను కళ్ల ముందు ఉండేలా చేస్తోంది.  
 

ఎన్డీఏ తిరుగులేని విజయానికి అన్ని పార్టీలు నేతల ఎవరి వంతు వారు తమ వంతు సహకారం అందించడం అత్యంత ముఖ్యమైనది. విజయం తర్వాత సైతం నేడు  కేంద్రంలో ఉన్న ప్రధాని, ఇతర మంత్రులు సహకారం, నిబద్ధతతో నిధులు తెచ్చి, ప్రజలకు మేలు చేయడం..  ఇలా సమర్థులంతా తమ తమ విభాగాల్లో సారథ్యం వహిస్తున్నందున ఇవాళ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలెక్కింది. నేటి సమాఖ్య , ఉమ్మడి రాజకీయ పార్టీలు ప్రణాళికాబద్ధంగా కలసి కట్టుగా పాలన చేయడం, కలసి కట్టుగా రాజకీయాలు చేయడం సారథ్యంలో ఓ కీలక భాగమే.

“కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబ సభ్యులందరూ బలంగా ఉండాలి. అలాగే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు బలంగా ఉంటేనే కూటమి బలంగా ఉంటుంది.“.  కేంద్రంలో 2014లో కాని 2019లో కాని తిరుగులేని మెజార్టీ వచ్చినా ఎన్డీఏను భారత రాజకీయాల్లో ఓ బలమైన కూటమిగా మార్చడంలో బీజేపీ ఎప్పుడూ అలక్ష్యం ప్రదర్శించలేదు.  ఎన్డీఏ కూటమి కలసికట్టుగా  దేశ ప్రగతిని సాధిస్తూ ప్రజలు కోరుకున్న పాలన అందిస్తోంది.

 
దాని ఫలితమే నేడు అనేక రకాలుగా పన్నులు విషయంలో అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నా, మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా  అగ్రదేశాలు అనే భుజకీర్తులు తగిలించుకున్న దేశాలను సైతం మనం తట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీఏ కూటమి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో, అభివృద్ధి , మరో వైపు సంక్షేమం సాధించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  ఏపీ వృద్ధి రేటు 10.50 శాతానికి చేరుకోవడం అభినందనీయం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి  ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధికి చక్కటి సంకేతంగా భావించవచ్చు.

అందుకే భారతీయ జనతా పార్టీ “సారధ్యం” పేరుతో  ఎన్డీఏ  కేంద్ర ప్రభుత్వం విజయాలను, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మంచి పనులు నేడు ప్రజలలోకి తీసుకెళ్లింది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ దశల్లో 26 జిల్లాలలో సారథ్యం పేరుతో నేరుగా ప్రజలను, పార్టీ శ్రేణులను కలిసి ఈ యాత్రను దిగ్విజయంగా నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న పురోగతిని, కేంద్రం అందిస్తున్న సహకారాన్ని,  రాష్ట్రంలో ఎన్డీఏ సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు తెలియచేసేలా ఈ “సారధ్యం” యాత్ర  విజయవంతంగా జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో జరిగిన ‘సారథ్యం యాత్ర అన్ని జిల్లాలోను సాగింది. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు, వారి అభిప్రాయాలను తీసుకున్నారు, మెరుగైన పాలనకు సూచనలు తీసుకున్నారు. యాత్ర ప్రధానంగా  బీజేపి  బలోపేతం, 11 సంవత్సరాల కేంద్ర పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరించడం, కూటమి ఐక్యత, ఉమ్మడి కార్యాచరణ రాష్ట్ర అభివృద్ధి అంశాలపై దృష్టి సారించింది.  సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన ఈ యాత్ర 14వ తేదీన విశాఖపట్నంలో ముగిసింది.

యాత్ర సమయంలో ప్రతి రోజు ఉదయం సాధారణ ప్రజలతో చాయ్‌ పే చర్చ పేరుతో నేరుగా మద్యతరగతి, సాధారణ ప్రజలను కలవడం , వారి ఆలోచనలు స్వీకరించడం మంచి ఆలోచన. దీనిపై ప్రజలలో చక్కటి సానుకూలత వ్యక్తంమైంది.  పలు జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు జరిగాయి. ప్రతి జిల్లాలో మీడియా సంస్థలలో పని చేసే అనేకమంది   జర్నలిస్టులను కలుసుకోని, ఆ జిజ్లాలో ఉన్న సమాస్యలు తెలుసుకోవడం తదుపరి కార్యచరణ కోసం చేసిన చక్కటి ప్రయత్నం.

ప్రస్తుత రాష్టంలో, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పాలన ప్రజలకు నిరతరం కూటమి పార్టీలు  అలాగే వివిద రూపాలలో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  “శక్తికి, యుక్తి తోడు అయితే  విజయాలకు ఎదురు ఉండదు”.  అలాంటి డబుల్ ఇంజిన్ పరుగందుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆంద్రప్రదేశే ఉదాహరణ.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రథానికి కూటమి సారథ్యానికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏపీలో నిధులు  పరుగులు పెడుతున్న తీరే నిదర్శనం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు సెమీకండక్టర్ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సెమీకండక్టర్ పరిశ్రమ రాబోయే రోజుల్లో అత్యంత కీలకం. ఓ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులు వస్తాయి. అందుకే సమీ కండక్టర్ ఇండస్ట్రీ కేటాయింపుపై విస్తృత ప్రచారం జరిగింది.  ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి పరిశ్రమల కేటాయింపులు, ప్రత్యేకమైన నిధులు,   ప్రాజెక్టులు కేటాయించడం సాధారణంగా మారిపోయింది.

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలో  చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమం వెనుక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యక్ష సహకారం ఉంది. అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి  వంటి వాటిలో నిధుల కొరత అనేదే లేదు.  సారథ్యం యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా అదే.

అమరావతి, పోలవరం. ఈ రెండింటిలోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్  సర్కారులో  పనులు వేగంగంతో దూసుకెళ్తోంది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో  ఆగిపోయన అనేక ప్రాజక్టులు గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకు వచ్చిన ప్రతి ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.  మొదటగా  2024-25 యూనియన్ బడ్జెట్‌లో అమరావతి డెవలప్‌మెంట్ కోసం రూ.15,000 కోట్లు కేటాయించారు.  ఈ నిధులు వరల్డ్ బ్యాంక్, ఎడిబి వంటి సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

 

మొదటి విడతలో రూ. 4,285 కోట్లు  విడుదల చేశారు. ఇది 25 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏప్రిల్ 1, 2025న వచ్చింది. ఇవన్నీ మోడీ కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక భరం లేదు. మే 2, 2025న ప్రధాని మోదీ అమరావతిలో రూ. 58,000 కోట్ల విలువైన  పనులను ప్రారంభించారు.  మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రూ. 50,475 కోట్లు కేటాయించారు, ఇందులో అమరావతి , జాతీయ రహదార్లు, మౌళిక సదుపాయాలు, విద్యారంగం సహా ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు అనేక రకాలుగా పలు శాఖలలో  పనులు జరుగుతున్నాయి.  దాదాపుగా  రాష్టంలో పలు రంగాల్లో నిర్మాణంలో ప్రభుత్వం నిమగ్నమైంది.  ఇది కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి .

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఐదేళ్ల పాటు గందరగోళంలో పడింది. అసలు ప్రాజెక్టు ఉనికే ఇబ్బందుల్లో పడిన సమయంలో ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతోంది.   కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,157 కోట్లను రెండు విడతలలో కేటాయించింది, 6,000 కోట్లు 2024-25లో,  రూ. 6,157 కోట్లు 2025-26లో కేటాయించింది.  వీటితో ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంది.

 
2024 అక్టోబర్ లో  కేంద్రం నుంచి రూ.  2,348 కోట్లు విడుదలయ్యాయి, అదనంగా రూ. 468 కోట్లు రీయింబర్స్‌మెంట్‌గా వచ్చాయి.   మరో  రూ. 2,704.81 కోట్లు 2025 ఫిబ్రవరి నాటికి విడుదలయ్యాయి.  మొత్తంగా  2014 నుంచి 2025 వరకు, కేంద్రం రూ. 13,226.04 కోట్లను ప్రాజెక్ట్ కోసం విడుదల చేసింది   2025 ఫిబ్రవరి నాటికి, ప్రాజెక్ట్ 55.90% పూర్తయింది. 2019-2024 మధ్య వైఎస్ఆర్పీసీ ప్రభుత్వం కింద  సంవత్సరానికి 2.32%  పురోగతి సాధించగా, ఎన్డీయే ప్రభుత్వం 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 8 నెలల్లో 6.11% పురోగతిని సాధించింది.
 
విశాఖకు గూగుల్ డేటా సెంటర్, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ రావడం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ . బోగాపురం ఎయిర్ పోర్టు శరవేగంగా పూర్తి అవుతుంది. రాయలసీమ ప్రాంతంలోని కొప్పర్తి నోడ్  ఒర్వకల్  పారిశ్రామిక కారిడార్ల  అభివృద్ధికి  రూ. 4,000 కోట్లు కేంద్రం కేటాయించింది.    ఈ కారిడార్లు ఇండస్ట్రియల్ గ్రోత్‌ను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఉన్నాయి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్ర అభివృద్ధికి రూ.  4,000 కోట్లు కేటాయించారు.  
 

ఈ ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించారు.  ఇందులో రోడ్లు, నీటి సరఫరా,ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి.  సోలార్, విండ్,  ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇస్తోంది.  ఏపీలో 1,336 కి.మీ. కొత్త  , అదనపు రైల్వే లైన్ల కోసం డీపీఆర్‌లు సిద్ధం  అయ్యాయి. విశాఖ రైల్వేజోన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల పాటు  గమ్యం గమనం లేని పాలన సాగింది. ఈ వియంలో మరో మాటకు తావు లేదు.  అలాంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్‌ను  మంచి  బాటలోకి నడిపించాలంటే.. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సారథ్యం వల్లనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్మారు ప్రజలు. అందుకే పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని నేడు కూటమి పార్టీలు సాద్యం చేయడానికి పని చేస్తున్నారు.

 
ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నిరతరం సహకారం అందించేందుకు నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన పార్టీ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం సైతం  వినియోగించుకుని ఆంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్  “సారథ్యం” యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ఇవే విషయాలను గుర్తు చేసుకున్నారు. 
 

ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించడానికే సారథ్యం చేయాలి. అలాంటి నాయకత్వం ప్రజలకు వచ్చినప్పుడు వారు ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించరు.  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన ఐదు సంవత్సరాల అసమర్థ పాలనను ప్రజలు వద్దు అనుకోని కూటమి పార్టీలు నేటి పరుస్థితులలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కావాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చేలా  గత యేడాది ఎన్నికల ఫలితాలు గుర్తు చేసింది. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేసి సరైన నాయకత్వంతో మంచి పాలన సారథ్యం ఇస్తామని కూటమి హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లింది.

అవన్నీ ఇప్పుడు చెప్పినట్లుగా చేస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ వేదికగా సగర్వంగా ప్రకటించారు.  అంతే కాదు ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎడ్యూకేషన్ హబ్‌గా మారుస్తామని, ప్రధాని మోడీ గారు ఆంధ్రకు కొత్త వందే భారత్ రైళ్లు అందించారు. విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకించి మోదీ గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది,  ఆంధ్రుల గుండెల్లో మోదీ గారు చిరకాలం ఉంటారు అని ఆయన ప్రకటించారు.

 
అవినీతితో కూడిన  అభివృద్ధి లేని నాటి పాలనను ప్రజలు మర్చిపోవడం కష్టం. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ సాధనలను ప్రజలకు చేరేలా చేయడమే సాగిన ఈ యాత్ర లక్ష్యాన్ని చేరింది.   ఏపీలో బీజేపీతో పాటు కూటమిని మరింత బలోపేతం చేసింది.  గ్రామగ్రామానికి కూటమి విజయాలు చేరేలా చేసింది.  నేటి రాజకీయాల్లో సారథ్యం అనే రాజకీయ పర్యటన ప్రజల్లో ఒక సానుకూలమైన చర్చ మొదలైందని కచ్చితంగా చెప్పవచ్చు.