భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్

భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్

ఆసియా కప్‌లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న భారత్‌ మరో అద్భుత విజయాన్ని నమోదుచేసింది.   ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(74), శుభ్‌మన్ గిల్(47), తిలక్ వర్మ(30), హార్ధిక్ పాండ్య(13)లు రాణించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 

ఇక పాకిస్థాన్ బ్యాటర్లలో సహిబ్‌జాద్ ఫర్హాన్ (58) పరుగులతో అర్ధ శతకం సాధించగా మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ (15), సయిమ్ ఆయూబ్(21), హుస్సేన్ తలాత్(10), మహమ్మద్ నవాజ్(21), ఫయిమ్ అస్రత్(20)లు రాణించడంతో పాక్ పటిష్టమైన టార్గెట్ భారత్ ముందు ఉంచింది. భారత బౌలర్లలో శివం ధూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.

అనంరతం లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ(74), శుభ్‌మన్ గిల్(47), రాణించడంతో తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వేగంగా పరుగులు చేసేందకు ప్రయత్నించిన గిల్ ఫయిమ్ అస్రఫ్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.  అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సయితం హరీస్ రౌఫ్ బౌలింగ్ అబ్రార్ అహ్మెద్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

దీంతో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ సాయంతో అభిశేక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అబ్రార్ వేసిన ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాదిన అభిషేక్ రెండో బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. బ్యాట్ చివరికి తాకిన బంతి గాలిలో లేవగా హరీస్ రౌఫ్ చాకచక్యంగా క్యాచ్ అందుకున్నాడు. భారత్ 123 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆచితూచి బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ, హార్ధిక్‌లు లాంచనాన్ని పూర్తి చేశారు.