
భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. దీని స్పష్టమైన ఉదాహరణగా దేశంలో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2021 తర్వాత ఈ వృద్ధి మరింత వేగవంతమైంది. తాజాగా వెలువడిన మెర్సిడెస్-బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం, గత నాలుగేళ్లలో కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య 90 శాతం పెరిగింది.
రూ.8.5 కోట్ల పైగా ఆస్తులు కలిగిన కుటుంబాలు 4.58 లక్షల నుండి 8.71 లక్షలకు పెరిగాయి.
అంటే ఇప్పుడు దేశంలోని ప్రతి 0.31 శాతం కుటుంబాలు కోటీశ్వరుల వర్గంలోకి చేరాయి. 2017 నుండి 2025 మధ్య ఈ సంఖ్య 445 శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందనే విషయాన్ని మరింత బలపరుస్తోంది. స్టాక్ మార్కెట్ లాభాలు, కొత్త వ్యాపారాల వేగవంతమైన వృద్ధి, ఆర్థిక విధానాలు – ఇవన్నీ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. కొత్త రంగాల్లో పెట్టుబడులు పెరగడం కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.
మహారాష్ట్ర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 1.78 లక్షలకు పైగా కుటుంబాలు కోటీశ్వరులుగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలోనే 1.42 లక్షల కోటీశ్వరుల కుటుంబాలు ఉండటంతో అది దేశ మిలియనీర్ రాజధానిగా నిలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ 79,800 కోటీశ్వరుల కుటుంబాలతో రెండో స్థానంలో ఉంది. తమిళనాడు 72,600 కుటుంబాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక అవకాశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
ఢిల్లీ తర్వాత బెంగళూరులో కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 31,600 కుటుంబాలు కోటీశ్వరులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అదే విధంగా అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, గురుగ్రామ్ నగరాల్లో కూడా సంపన్నుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ, భారత్లో సంపద పెరుగుదల అద్భుతంగా ఉందని తెలిపారు.
రాబోయే పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య 1.7 మిలియన్ల నుండి 2 మిలియన్ల వరకు చేరవచ్చని నివేదిక వేఅంచనా సింది.ఈ వృద్ధి ఎక్కువగా మధ్యస్థాయి కోటీశ్వరుల వర్గంలో ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. అంటే, సంపద ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, విస్తృతంగా పంచబడుతోందని చెప్పవచ్చు. భారత్లో సంపద పెరుగుదల వేగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది దేశ ఆర్థిక భవిష్యత్తు మరింత బలంగా నిలిచే సూచనగా మారింది.
More Stories
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
25 శాతం అదనపు సుంకాలను అమెరికా తొలగించే అవకాశం
ఆగస్టులో సుంకాలతో అమెరికాకు తగ్గిన ఎగుమతులు