
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యమేనని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. దేశానికి సేవ చేయాలంటే త్రివిధ దళాలల్లో చేరాలని విద్యార్థులకు సూచించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, అవకాశం వస్తే మరింత కఠినమైన దాడి జరుగుతుందని స్పష్టం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 36 స్కూళ్ల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.
“బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ఫౌజ్ (సైన్యం). మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, దేశంతో పాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే మీరు సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షించాలి” అని ఆయన ఆహ్వానించారు. “ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల ఘటనలు చాలా జరిగాయి. ఈ క్రమంలోనే రెస్క్యూ ఆపరేషన్లలో అనేక మందిని రక్షించేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేసింది” అని జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. సైన్యం ఎప్పుడూ దేశానికి నష్టం కలగకుండా కాపాడడమే ధ్యేయం అని తెలిపారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆపరేషన్ సిందూర్ గురించి సీడీఎస్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై ఒంటి గంటకు తొలి దాడిని నిర్వహించినట్లు తెలిపారు. ‘సాధారణంగా తెల్లవారుజామున దాడులు జరుగుతాయి, కానీ ఆ సమయంలో ప్రజలు కదికలు ఉంటాయి. అప్పుడు దాడి జరిగే అమాయక ప్రజలు ప్రాణ నష్టం జరిగేది. అందుకే రాత్రి సమయంలోనే దాడి నిర్వహించాం’ అని చెప్పారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్