
గగయాన్ మిషన్ను సంబంధించిన పనులు జరగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ చివర్లో మానవరహిత అంతరిక్ష నౌకను పంపాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. మిషన్ విజయవంతం కావడానికి ఉష్ణోగ్రత, పీడనం, తేమ, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వంటి అనేక అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. భద్రతలో భాగంగా తప్పించకునే వ్యవస్థను కూడా రూపొందించినట్లు చెప్పారు.
అంతేకాకుండా తొమ్మిది పారాచూట్లు స్పేస్ క్రాఫ్ట్ సముద్రంలో సురక్షితంగా దిగడానికి సహాయపడుతుందని తెలిపారు. ఇస్రోతో పాటు భారత వైమానిక దళం, నౌకాదళం, డీఆర్డీఓ, అనేక ఇతర సంస్థల ఈ ప్రాజెక్టులో పాల్గొన్నాయని నారాయణన్ చెప్పారు. ఇక వ్యోమమిత్ర అనేది అచ్చం మనిషిలాగే పెదవులు కదిలిస్తూ మాట్లాడుతుంది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేలా వ్యోమమిత్రను ప్రోగ్రామ్ చేశారు. ఇది మనుషులనూ గుర్తిస్తుంది.
అంతరిక్షంలో వ్యోమగాములు చేసే పనులన్నింటినీ చేస్తుంది. కబుర్లు చెబుతుంది. అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. సిరి, అలెక్సా, కోర్టానా వంటి కృత్రిమ మేధ పరిజ్ఞానాలనూ ఈ రోబోను విస్తరించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాముల భద్రత, మనుగడకు ఉద్దేశించిన వ్యవస్థలను పరీక్షిస్తుంది. క్యాబిన్‌లో వాతావరణం మారితే వాటిని గుర్తించి హెచ్చరిస్తుంది. నేల మీది నుంచి శాస్త్రవేత్తలు అందించే సూచనలను గ్రహిస్తుంది.
ఆ సూచనల మేరకు నడచుకోగలదు. లోపల కార్బన్ డయాక్సైడ్ పెట్టెలను మార్చేలా అన్ని పనులు చేయగలదు. టెక్నికల్ పనులు చేయటమే కాకుండా వ్యోమగాములకు విసుగు పుట్టకుండా మానసికంగా దన్నుగానూ నిలవనుంది. కృత్రిమ స్నేహితుడిలా తోడుగా ఉంటుంది. ప్రయోగిస్తున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు, కక్ష్యలో ఉన్నప్పుడు వ్యోమనౌక స్థితి ఎలా ఉందో చెబుతుంది. క్రూ మాడ్యూల్ అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్నప్పుడు లోపల జరిగిన మార్పులను నివేదిస్తుంది.
వ్యోమగాములను దాదాపు 400కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి పంపి, తిరిగి వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడమే గగయాన్ మిషన్ లక్ష్యం. ఈ ప్రయోగం మూడు రోజులు పాటు జరగనుంది. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది. ఇప్పటికే ఈ మిషన్ కోసం చేపడుతున్న అని పరీక్షలు విజయవంతం అవుతున్నాయి. గగన్‌యాన్ యాత్రను ఇస్రో 2027 మొదటి త్రైమాసికంలో చేపట్టనుంది. భారత్ చేపడుతున్న ఈ గగన్యాన్ విజయవంతం అయితే, రష్యా, అమెరికా, చైనా తర్వాత స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.
More Stories
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం
అన్ని మతాలను గౌరవిస్తాను