అమెరికాతో సానుకూలంగా వాణిజ్య చర్చలు

అమెరికాతో సానుకూలంగా వాణిజ్య చర్చలు
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరితగతిన పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదలు చేసింది. ఇదే అమెరికా ప్రతినిధి బ్రెండన్‌ లించ్‌ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందం కోసం తదుపరి ద్వైపాక్షిక చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఇరుదేశాలు అంగీకరించినట్లు చెప్పారు.

“పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రధాన చర్చాకర్త బ్రెండన్ లించ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా, భవిష్యత్తు దృక్పథంతో ఉన్నాయి” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ వాణిజ్య చర్చల కోసం సోమవారం రాత్రి అమెరికా ప్రతినిధి బ్రెండెన్‌ లించ్‌ భారత్‌కు వచ్చారు.

భారత్ తరఫున వాణిజ్యశాఖకు చెందిన సీనియర్‌ అధికారి రాజేశ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహించారు. డిల్లీలోని వాణిజ్య భవన్‌లో వీటిని కొనసాగించాయి. అయితే వీటిని ఆరో వాణిజ్య చర్చలుగా పరిగణించకూడదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది దానికి ముందస్తు సన్నాహక దశ మాత్రమే అని పేర్కొన్నారు.  ఇరు పక్షాలు వారానికొకసారి వర్చువల్ చర్లు కొనసాగిస్తారని తెలిపారు. తదుపరి ప్రత్యక సమావేశానికి అనుకూలమైన తేదీని కూడా నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు.

అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య చర్చలు మార్చి నుంచి జరుగుతన్నాయి. ఇప్పటి వరకు ఇరు దేశాల ప్రతినిధులు ఐదు సార్లు చర్చలు జరిపారు.  రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని భారత్​పై అమెరికా 50శాతం సుంకాన్ని విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో అనిశ్చిత నెలకొంది. అయితే ఇటీవల భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. 

ఆ వెంటనే దానికి మోదీ బదులిచ్చారు. తాను కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. ఆ నేపథ్యంలో లించ్‌ మన దేశానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరో దఫా చర్చల కోసం ఆగస్టు 25న అమెరికా నిపుణుల బృందం భారత్​కు రావాల్సి ఉంది.  కానీ సుంకాల ప్రభావం​తో ఆ పర్యటన రద్దయ్యింది. ఒప్పందంలో మొదటి దశను ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని మన ప్రధాని సమాధానిమిచ్చారు. ఈ క్రమంలో అమెరికా ప్రతినిధి భారత్ పర్యటన జరగననుంది.