
టీటీడీపై భూమన ఉద్దేశపూరకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదు.. శనీశ్వరుడి విగ్రహమని స్పష్టం చేశారు. దీనిపై మధ్యాహ్నం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో బోర్డు తీవ్రంగా స్పందించింది. టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు హెచ్చరించారు.
కాగా, టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు చేసిన ఫిర్యాదు మేరకు భూమనపై అలిపిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమాచారంతో భూమన మరో వీడియో విడుదల చేశారు. శనైశ్చరుడి విగ్రహానికి శంఖు చక్రాలు ఎందుకుంటాయని, దాన్ని ఎవరో తెచ్చి పడేస్తే తీసివేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అని ప్రశ్నించారు.
కాగా, భూమన ఆరోపణలను ఏపీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. కాగా, అలిపిరిలోని విగ్రహంపై స్థపతి కన్నయ్య చారి కుమారుడు గురుస్వామి స్పష్టత ఇచ్చారు. దాదాపు 22 ఏళ్ల క్రితం తమకు రాయలచెరువు రోడ్డులో విగ్రహాల తయారీ షెడ్డు ఉండేదని చెప్పారు.
More Stories
దళితవాడల్లో టిటిడి 1000 ఆలయాలు నిర్మాణం
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం