
చదరంగం బోర్డుపై భారత గ్రాండ్‌మాస్టర్లు అదరగొడుతున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఆఖరి రౌండ్ (11)లో ఆమె ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగ్యీతో గేమ్‌ను డ్రా చేసుకుంది. ముఖ్యంగా మహిళా గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌తో పాటు తాజాగా ఆర్. వైశాలి స్విస్ టైటిల్‌ను కైవసం చేసుకొని రికార్డుపుటల్లోకెక్కింది.
ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్‌తో దివ్య దేశ్‌ముఖ్ ఇటీవల చేజిక్కించుకొని కొత్త అధ్యాయం లిఖించగా, తాజాగా ఆర్. వైశాలి ప్రతిష్టాత్మక గ్రాండ్ స్విస్ టైటిల్ కైవసం చేసుకుంది.
ఈ టైటిల్‌ను వైశాలి చేజిక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. దీంతో వైశాలి ఈ టైటిల్‌ను రెండుసార్లు చేజిక్కించుకొన్న తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డుపుటల్లోకెక్కింది. సోమవారం జరిగిన చివరి, 11వ రౌండ్ గేమ్‌లో వైశాలి మహిళల ప్రపంచ ఛాంపియన్, చైనాకు చెందిన టాంగ్ జోంగ్యీతో మ్యాచ్‌ను డ్రా గా ముగించింది. దీంతో అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
ఈ టైటిల్‌ను చేజిక్కించుకోవడం ద్వారా వైశాలి 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. సోదరుడు ప్రజ్ఞానంద తరహాలోనే వ్యూహాత్మక ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించే వైశాలి.. తొలిరౌండ్‌నుంచి ప్రత్యర్థులకు చెక్ పెడుతూ పాయింట్లను కొల్లగొడుతూ వచ్చింది. వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన మూడో భారతీయురాలిగా వైశాలి నిలిచింది. అంతకుముందు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నీకి ఇప్పటికే బెర్తులు దక్కించుకున్నారు.
More Stories
డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్య ఖండించిన ట్రంప్
ముగ్గురు మంత్రులతో నేపాల్ మంత్రివర్గం విస్తరణ
అమెరికా చెప్పినట్లు టారిఫ్ విధిస్తే ప్రతిచర్యలు