
అమెరికాలోని డల్లాస్‌లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అని మండిపడ్డారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్ విధానంతోనే ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ విదేశీయుడు, ఇంతకు ముందు నేర చర్యల రికార్డు ఉన్న క్యూబా వలసదారు చేతిలోనే అత్యంత క్రూరంగా ఈ భారతీయ సంతతి వ్యక్తి హతుడు కావడం బాధాకరం అని తెలిపారు.
కర్నాటకు చెందిన 50 సంవత్సరాల చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్యను డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్లోతాను అధికారిగా ఉన్న చోటనే ఈ నెల 10 వ తేదీన ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత కిరాతకంగా చంపివేశారు. నిందితుడిని 37 సంవత్సరాల యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్, క్యూబావాసి అని నిర్థారించారు. ఈ వ్యక్తిపై హత్యానేరం పై విచారణ సాగుతోంది.
హతుడి అంత్యక్రియలు రెండు రోజుల క్రితం ఆయన స్నేహితులు, సమీప బంధువుల సమక్షంలో జరిగాయి. ఆయన కుటుంబ సహాయార్థం సన్నిహితులు 321,326 డాలర్లు సేకరించి అందించారు. అక్రమ వలసలతో సాగుతున్న దౌర్జన్యాల విషయం డల్లాస్ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. సరైన విధంగా ఇమిగ్రేషన్ పాలసీ తీర్చిదిద్దాల్సి ఉందని ట్రంప్ మరోసారి తమ స్పందన వెలువరించారు.
హంతకుడిని ఈ మధ్యనే అమెరికా నుంచి సొంత దేశం క్యూబాకు తరలించారు. అయితే ఆయనను అక్కడి అదికారులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు దారుణ హత్యకు పాల్పడి జైలుపాలయ్యాడు. వాషింగ్ మెషీన్ వాడొద్దన్నందుకు నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు తరుముతుండగా, బాధితుడు పరిగెత్తుతూ భయంతో కేకలు వేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
డాలస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్‌లో డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్ ఉంది. అందులో కర్ణాటక మూలాలున్న చంద్ర నాగమల్లయ్య (50) మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నిందితుడు కోబోస్ మార్టినెజ్ (37), మరో ఉద్యోగిని గదిని శుభ్రం చేస్తుండగా, అక్కడికి వచ్చిన నాగమల్లయ్య అక్కడి పాడైపోయిన మెషీన్‌ను వాడొద్దని వారికి చెప్పాడు. నాగమల్లయ్య హత్యపై హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
More Stories
గ్రాండ్ స్విస్ విజేత వైశాలి.. వరుసగా రెండో టైటిల్
ముగ్గురు మంత్రులతో నేపాల్ మంత్రివర్గం విస్తరణ
అమెరికా చెప్పినట్లు టారిఫ్ విధిస్తే ప్రతిచర్యలు