
ఆసియాకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారత్ బెబ్బులిలా గర్జించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన తొలి పోరులో పాక్‌ను చీల్చిచెండాడుతూ టీమ్ఇండియా విజయబావుటా ఎగురవేసింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ‘మ్యాచ్ బాయ్‌కాట్’ నేపథ్యంలో ఉద్వేగభరితంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం వార్వన్సైడ్ అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సొంతం చేసుకుంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ అయ్యాక కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. గ్రౌండ్ నుంచి డగౌట్‌కు వచ్చేశారు. అయితే కాదు ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు సూర్య.
పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నట్లు తెలిపిన సూర్య కుమార్ యాదవ్, సంఘీభావాన్ని తెలియజేశాడు. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారని, అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తునే ఉంటామని తెలిపాడు.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో భారత్ నాలుగు పాయింట్లతో గ్రూపు-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పాక్‌ను తమ స్పిన్ తంత్రంతో పడగొడుతూ స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపరేషన్ స్పిన్ త్రయం కుల్దీప్యాదవ్, అక్షర్‌పటేల్, వరుణ్ ధాటికి పాక్ చిగురుటాకులా వణికింది. బంతి ముట్టుకుంటే ఔట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు పాక్‌పై ముప్పేటా దాడి చేశారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్ జట్టు విలవిలాడింది.
కుల్దీప్యాదవ్(3/18), అక్షర్‌పటేల్ (2/18), బుమ్రా (2/28) ధాటికి పాక్ 20 ఓవర్లలో 127/9 స్కోరుకు కుప్పకూలింది. ఫర్హాన్(40), ఆఫ్రిదీ(33 నాటౌట్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 131/3 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), అభిషేక్‌వర్మ(31), తిలక్‌వర్మ(31) విజయంలో కీలకమయ్యారు. ఈనెల 19న ఒమన్‌తో భారత్ తలపడనుంది.
పాకిస్థాన్‌పై టీమ్ఇండియా గెలవడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాలను పట్టుకుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే సాధించింది. భారత బౌలర్లు చెలరేగిపోవడంతో 9 వికెట్ల కోల్పోయింది.
ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు అలవోకగా చేధించారు.15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (47*; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. శుభ్‌మన్ గిల్ (10) తక్కువస్కోరుకే వెనుదిరిగాడు. శివమ్ దూబె (10*) నాటౌట్‌గా నిలిచాడు.
పాక్ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచారు. షాహీన్ అఫ్రిది (33), ఫకర్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, బుమ్రా రెండు చొప్పున, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. టీం ఇండియా బౌలర్లలో తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య.. తొలి బంతికే సయిమ్ అయూబ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టించాడు.
రెండో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో మహమ్మద్ హారిస్ (3) బుమ్రాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్‌లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 7.4 ఓవర్లో ఫకర్ జమాన్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 13వ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. చివర్లో షాహీన్ అఫ్రిది దూకుడుగా ఆడాడు. దీంతో పాక్ జట్టు స్కోరు 100 దాటింది.
నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్‌కు వచ్చింది. దీంతో గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయం అందుకుంది. తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగననుంది. టీమ్ఇండియా ఒమన్‌తో తలపడనుంది.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!