
జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని, ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన, సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావించిన త్యాగి, భారత్ తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు ఎక్కడి వరకైనా వెళ్తుందని స్పష్టం చేశారు. తాము సార్వభౌమాధికారంపై రాజీపడబోమని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విఫల దేశం తప్పుడు ప్రచారాన్ని బహిర్గతం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌పై నేరుగా ఎదురుదాడి చేస్తూ ఆ దేశం ఉనికి ఉగ్రవాదం, తప్పుడు ప్రచారంపైనే ఆధారపడి ఉందని ఘాటుగా స్పందించారు.
పాకిస్తాన్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని, భారతదేశానికి వ్యతిరేకంగా అనారోగ్య అబ్సెసివ్ ఆలోచన దాని ఉనికికి మద్దతుగా మారిందని క్షితిజ్ త్యాగి విమర్శించారు. అలాగే, స్విట్జర్లాండ్ ప్రకటనపై స్పందిస్తూ భారత్‌కు సన్నిహిత మిత్రదేశమైనప్పటికీ స్విట్లర్లాండ్ తప్పుడు వ్యాఖ్యలు చేసిందని విచారం వ్యక్తం చేశారు.
తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి బదులుగా తన దేశం (స్విట్జర్లాండ్)లోని సమస్యలైన జాత్యహంకారం, వివక్ష, విదేశీయులపై ద్వేషం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని’ హితవు పలికారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద, వైవిధ్యభరితమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశమని గుర్తు చేశారు. అవసరమైతే స్విట్జర్లాండ్ ఈ సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ స్పష్టం చేశారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్
`బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఫ్రాన్స్ లో పెద్దఎత్తున నిరసనలు