అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!

అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!

భారత్‌, అమెరికా వాణిజ్య అడ్డంకుల తొలగింపులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని నరేంద్ర  మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దీనికి ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తుండటంతో అమెరికాతో వాణిజ్య సంబంధాలు బీటలు వారాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్‌ ముందుకొచ్చారు. తన ట్రూత్‌ సోషల్‌లో స్పందించిన ఆయన భారత్‌, అమెరికా మధ్యవ ఆణిజ్య అడ్డకుంలను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. 

రాబోయే రోజుల్లో తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు పలికేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానని తెలిపారు. భారత్‌తో వాణిజ్య చర్చల గురించి ట్రంప్‌ చేసిన పోస్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. భారత్‌, అమెరికా క్లోజ్‌ ఫ్రెండ్స్‌, సహజ భాగస్వాములని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొందరలోనే తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. 

తమ మధ్య సంబంధం మరింత బలపడతుందని ఆశించారు. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో భాగంగా తన స్నేహితుడు భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదరుచూస్తున్నానని ప్రకటించారు. రెండు దేశాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తమ మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు మోదీ.

సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్‌లోని బృందాలు కృషి చేస్తున్నాయని, నేను కూడా ట్రంప్‌తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తామని వెల్లడించారు. భారత్​పై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్​ నిర్ణయం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కొంతవరకు దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. కానీ ట్రంప్ ఓవైపు సుంకాలు విధిస్తూనే, మరోవైపు ప్రశంసిస్తున్నారు.

న్యూడిల్లీతోపాటు వాషింగ్టన్ సంబంధాలతోపాటు, మోదీని ప్రశంసించడం ఇది రెండోసారి. ఇప్పుడు మోదీ ట్రంప్ వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించడం గమనార్హం. అయితే సుంకాలు విధించడం, పాక్​తో భారత్ యుద్దాన్ని తానే ఆపానని చెప్పడం వంటి ఘటనల తర్వాత పలుమార్లు మోదీకి ట్రంప్ కాల్ చేశారని తెలుస్తోంది. కానీ మోదీ వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని సమాచారం. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఓ జర్మన్‌ పత్రిక పేర్కొనగా, తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఇది వాస్తవమే అన్నట్లు కథనం ప్రచురించింది. 

ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ జీ7 సదస్సు నిమిత్తం కెనడాకు వెళ్లారు. ప్రధాని చేరుకునే సమయానికి ట్రంప్‌ అక్కడి నుంచి అత్యవసర పనిపై అమెరికాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు నుంచి మోదీకి ఫోన్‌ కాల్‌ వచ్చింది. వాషింగ్టన్‌ రావాలని ఆహ్వానం అందింది. కానీ, క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉండటంతో అది సాధ్యం కాదంటూ మోదీ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. 

అయితే తెరవెనక వ్యూహం మాత్రం మరొకటి అప్పటికే పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికాలో ఉన్నారు. మోదీని కూడా శ్వేత సౌధం ఆహ్వానించి తనతోపాటు మునీర్‌ను అక్కడికి పిలిపించి ఫొటో దిగాలన్నది ట్రంప్‌ కోరికగా గుర్తించారు. ఇది ఏమాత్రం ఇష్టంలేని ప్రధాని అక్కడికి వెళ్లలేదు. అప్పటి నుంచే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం మొదలయ్యాయి.

ఆ తర్వాత కూడా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ప్రధాని మోదీతో మాట్లాడేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. కానీ, అప్పటికే ఇరు దేశాల మధ్య విశ్వాసం దెబ్బతినడంతో ఇది సాధ్యం కాలేదు. ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌లో అప్పటికే ఇష్టారాజ్యంగా రాతలు రాస్తుండటం, మోదీ కార్యవర్గంలోని వారిని కలవరానికి గురి చేసింది. ఆ తర్వాత ట్రంప్‌ వైపు నుంచి కాల్స్‌ వచ్చినా మోదీ వైపు నుంచి ప్రతి స్పందన లేదు. ఇప్పుడు మాత్రం ఆయన స్పందించారు.