
పాకిస్తాన్ భారీ ప్రాజెక్ట్ నుండి చైనా వైదొలిగింది. దీంతో పాకిస్తాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో 17.6వేల కోట్ల అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కరాచీ- రోహ్రీ రైల్వే అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ నుండి చైనా వైదొలిగింది. ఈ ప్రాజెక్ట్ చైనా వాయువ్య ప్రాంతమైన జిన్జియాంగ్ను పాకిస్తాన్ ఓడరేవు నగరం గ్వాదర్‌తో కలుపుతుంది. భారతదేశం- చైనా సంబంధాలు మళ్లీ బలపడుతున్న సమయంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌పై భారతదేశం తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ఇటీవల అమెరికాపై ఎక్కువగా ఆధారపడటం కూడా చైనా నిర్ణయానికి కారణమని నివేదించబడింది. దశాబ్దానికి పైగా విఫలమైన చర్చల తర్వాత పాకిస్తాన్ రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి)ని సంప్రదించింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 1,800 కి.మీ. కరాచీ- పెషావర్ రైల్వే అప్‌గ్రేడ్ ఒక ప్రధాన ప్రాజెక్ట్ గా ఉంది. దీనిని ఎంఎల్1 అని కూడా పిలుస్తారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చైనా గతంలో తన అయిష్టతను వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. ఇటీవల బీజింగ్‌ను సందర్శించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, చైనా తన నిర్ణయంలో దృఢంగా ఉంది. బలూచిస్తాన్‌లోని రాగి, బంగారు గనులకు రవాణాను సులభతరం చేయడానికి రైల్వేను అప్‌గ్రేడ్ చేయడానికి పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అమెరికా ఈ ప్రాంతంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది.
3,000 కిలోమీటర్ల ఆర్థిక కారిడార్‌లో భాగమైన వివిధ ప్రాజెక్టుల కోసం పాకిస్తాన్‌కు వచ్చే చైనా అధికారులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. వారికి భద్రత కల్పించడంలో తాను విఫలమవుతున్నానని షాబాజ్ సమావేశంలో అంగీకరించినట్లు కూడా సమాచారం. ఆర్థిక కారిడార్ కోసం చైనా 5.28లక్షల కోట్లు ప్రకటించింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్