
కొందరు యువకులు కార్లలో పాల్గొని పాకిస్థాన్, పాలస్తీనా జెండాలను ప్రదర్శించారు. ఈ చర్య స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు కనిపించగానే కొందరు స్థానికులు తీవ్రంగా స్పందించారు. దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనకు బాధ్యులుగా భావించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో ఉపయోగించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సీఐ నాగదుర్గారావు అధికారికంగా వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకులు ఏ ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డారు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.ఘటన తర్వాత నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. ఎలాంటి అపశ్రుతులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో కాకినాడ ప్రజల్లో ఆందోళన నెలకొంది. మతపరమైన వేడుకల్లో ఇలా విదేశీ జెండాలు ప్రదర్శించడం తగదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు సామాజిక సమైక్యతను దెబ్బతీస్తాయని వారు పేర్కొన్నారు.ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. ఎవరు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు