805 డ్రోన్లు, క్షిపణలతో ఉక్రెయిన్ పై రష్యా దాడి

805 డ్రోన్లు, క్షిపణలతో ఉక్రెయిన్ పై రష్యా దాడి

* యుద్ధంలో రష్యా ఉపయోగించే ఆయుధాలలో 60 శాతం ఉక్రెయిన్ వే

ఆదివారం తెల్లవారుజామున 805 డ్రోన్లు, క్షిపణలుతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది.  ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు చేపట్టిన అనంతరం ఇది అతిపెద్ద దాడి కావడం గమనార్హం. ఆదివారం నాటి దాడి రష్యా డ్రోన్‌ దాడిలో అతిపెద్దదని ఉక్రెయిన్‌ వైమానికి దళ ప్రతినిధి యూరి ఇహ్నాత్‌ ధృవీకరించారు. 13 రకాల క్షిపణులను కూడా ప్రయోగించిందని పేర్కొన్నారు.
 
అయితే, ఉక్రెయిన్‌ 747 డ్రోన్లు, 4 క్షిపణులను కూల్చివేసి, తటస్థీకరించినట్లు వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌ అంతటా 37 ప్రదేశాల్లో తొమ్మిది క్షిపణి దాడులు, 56 డ్రోన్‌ దాడులు జరిగినట్లు తెలిపింది. కూల్చివేసిన డ్రోన్లు, క్షిపణుల శిథిలాలు 8 ప్రదేశాలపై పడ్డాయని చెప్పారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై జరిగిన రష్యా దాడిలో ఇద్దరు మరణించగా, 15 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంత్రుల కేబినెట్‌ భవనం పైకప్పు నుండి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.
అయితే ఈ పొగ దాడి కారణంగా వెలువడిందా? లేదా డ్రోన్లు, క్షిపణుల శిథిలాల కారణంగా వెలువడిందా? అన్న అంశంపై స్పష్టత లేదు.  మొదటిసారిగా, ప్రభుత్వ భవనం రష్యా దాడిలో దెబ్బతినింది అని ఉక్రెయిన్‌ ఉక్రెయిన్‌ ప్రధాని యులియా స్వైరిడెంకో చెప్పారు. రష్యా డ్రోన్‌ శిథిలాలు కీవ్‌లోని స్వియాటోషిన్స్కీ జిల్లాలోని తొమ్మింది అంతస్తుల భవనాన్ని, డార్నిట్స్కీ జిల్లాలోని నాలుగంతస్తుల భవనాన్ని ఢకొీట్టాయని మేయర్‌ విటాలి క్లిట్ష్కో తెలిపారు.
 
ఇలా ఉండగా, గత మూడేళ్లుగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60 శాతం తమ దేశంలో ఉత్పత్తి చేసినవేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీచెప్పారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ  స్వదేశీ ఉత్పత్తులపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని తెలిపారు.  ఓ వైపు సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్‌ బలమైన, అత్యాధునిక ఆయుధాలను తయారుచేసే స్థాయికి ఎదగడం గర్వకారణమని చెప్పారు.
అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో త్వరలో చర్చలు జరపనున్నట్లు చెప్పారు. రష్యా దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌ తన దేశీయ రక్షణ పరిశ్రమలను గణనీయంగా విస్తరించినట్లు కీవ్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి.