
హైదరాబాద్‌లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది. నగరం నలుమూలల నుంచి నిమజ్జనం కోసం వచ్చిన గణపతి విగ్రహాలు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో బారులు తీరాయి.
ఇటు ఖైరతాబాద్ నుండి మహాగణపతి, అటు బాలాపూర్ నుండి నగర వ్యాప్తంగా వెలసిన గణనాథుల శోభయాత్ర హు స్సేన్ సాగర్‌కు చేరకుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మ.1.45గం.లకు పూర్తయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి 12గం.ల దాటాక చివరిసారిగా గణపతికి పూజారులు కలశపూజ నిర్వహించారు. శనివారం వేకువ జామున 69 అడుగుల ఎత్తు, 50 టన్నులున్న గణనాథుడి విగ్రహన్ని 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ టస్కర్‌పైకి చేర్చారు.
సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రారంభింభించి మహాగణపతి నిమజ్జనం మ.1.45 గం. లకు పూర్తయ్యింది. ఈ ఏడాది శోభాయాత్ర సుమారు 2.5 కిలోమీటర్ల దూరం సాగింది. బాలాపూర్ గణనాథుడి ని మజ్జనం ట్యాంక్‌బండ్‌పై 12వ క్రేన్ వద్ద సా.6.52 గం.లకు జరిగింది. గ్రేటర్లో మొత్తం 2.6 లక్షల విగ్రహాలు ఆదివారం ఉదయంకు గంగమ్మ ఒడికి చేరినట్టు అధికార వర్గాల సమాచారం.
ఈ శోభయాత్రలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లే కుండా, జీహెచ్ఎంసి, పోలీసు, విద్యుత్, జలమండ లి, కలెక్టర్, హెచ్ఎండిఏ, రోడ్డు భవనాలు, వైద్య వి భాగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఆద్యంతం చూసేందుకు భారిగావచ్చి బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్, ఇతర చెరువులతోపాటు 74 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగింది. హుస్సేన్‌సాగర్ తీరం జన సంద్రంగా మారింది. శోభాయాత్ర మార్గాల్లో భక్తుల కోసం తాగునీరు, పులిహోర, పొంగల్, పూరీలు, గుగ్గిళ్లు వంటి ప్రసాదాలు అందజేశారు.
నివారం నిమజ్జనానికి ముందు చాలా చోట్ల వినాయక మంటపాల్లో లడ్డూ ప్రసాదం వేలం పోటాపోటీగా సాగింది. ప్రఖ్యాత బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని (21 కిలోలు) కర్మాన్‌ఘాట్ బీజేపీ నేత లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. మరోవైపు గణేశుడి లడ్డూ వేలం సంప్రదాయం విదేశాలకూ చేరింది. కెనడాలోని స్కార్బరో తెలుగు అసోసియేషన్ గణేశుడి 10 కేజీల లడ్డూను కొందరు స్నేహితులు కలసి రూ.15.1 లక్షల (18,116 కెనడా డాలర్లు) రూపాయలకు కొంతమంది స్నేహితులు కలసి దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలుగు సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను సినీ పంపిణీదారు మోహన్ కమ్మ రూ.2.55 లక్షలు (4,694 ఆస్ట్రేలియన్ డాలర్ల)కు సొంతం చేసుకున్నారు. బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ తెలుగు సంఘం ప్రతినిధుల వినాయకుడి లడ్డూను సంఘం సభ్యుడు రుద్రారం రవి రూ.48 వేలకు (21,000 థాయ్భాత్) పొందారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం