మతపరమైన హింసతో వచ్చిన వలసదారులకు ఊరట

మతపరమైన హింసతో వచ్చిన వలసదారులకు ఊరట

మతపరమైన హింస నుంచి తప్పించుకోడానికి భారతదేశానికి వచ్చిన వలసదారులకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప ఊరట కల్పించింది.. 2024 డిసెంబర్ 31 కి ముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ప్రాసిక్యూషన్ బెదడ తప్పినట్లే. వారు పాస్ పోర్ట్ లేదా, ఎలాంటి ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.

గత సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ప్రకారం 2014 డిసెంబర్ 14 లేదా అంతకు ముందు మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వచ్చిన మైనారిటీ సభ్యులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ మధ్య అమలు లోకి వచ్చిన ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ముఖ్యమైన ఉత్తర్వు ఇది. 2014 తర్వాత భారతదేశంలోకి వలస వచ్చిన వారు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు.

వారికి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఉపశమనం కలిగిస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో మైనారిటీ కమ్యునిటీకి చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు మతపరమైన హింసకు భయపడి భారత దేశం లో ఆశ్రయానికి వచ్చి, 2034 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా, చెల్లుబాటు తేదీ దాటిపోయినా, వారందరికీ పాస్ పోర్ట్ లేదా వీసా కలిగి ఉండాలన్న నియమం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ విషయాన్ని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.

తాజా నిర్ణయంతో 2024 డిసెంబర్ 31 లోపు భారత్‌లోకి వలస వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారిక గుర్తింపు పత్రాలు లేకున్నా వారంతా భారత్‌లో నివసించవచ్చని తెలిపింది.  ఈ నిర్ణయంతో అలాంటివారికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ నిర్ణయంతో గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో కాందిశీకుల్లా నివసిస్తున్న వారు గౌరవంగా జీవించవచ్చని, వారు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగించవచ్చని.. ఆస్తులు కూడా కొనుగోలు చేయవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 

పాకిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలస వచ్చిన శరణార్థులకు పత్రాలు లేకపోయినా.. వెంటనే పౌరసత్వం ఇచ్చేలా పౌరసత్వ సవరణ చట్టం-2019ని గతేడాది కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సీఏఏ-2019 చట్టం ప్రకారం.. ఈ 3 దేశాల నుంచి వచ్చిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.