చాట్ జీపీటితో పొంచి ఉన్న ప్రమాదం

చాట్ జీపీటితో పొంచి ఉన్న ప్రమాదం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడుతున్నారు. ఇక ఈ సాంకేతిక యుగంలో `చాటిజీపీటీ’కి విశేషంగా ఆదరణ    లభిస్తున్నది. ఇదేసమయంలో దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఇటీవల హానికరమైన కంటెంట్ ను అందిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి.  అమెరికాలో ఓ టీనేజర్ ను చాటిజీపీటీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు.

మరో వ్యక్తి అయితే ఏకంగా చాటే జీపీటీ మాటలు విని కన్నతల్లినే చంపాడు. దీంతో భద్రతాపరమైన నియమాలపై చర్యలు తీసుకుంటోంది కంపెనీ. చాటీజీపీటీ వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే, అవి మానవ మోడరేటర్ల పరిశీలనకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని ఓపెన్ఏఐ పేర్కొంది. తక్కువ సమయం పాటు జరిగే సంభాషణల్లో ఈ సేఫ్టీ సిస్టమ్ బలంగా పనిచేస్తుందని, దీర్ఘకాలంలో జరిగే చర్చల్లో లేదా పునరావృత సంభాషణల్లో ఈ భద్రత తగ్గే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. 

టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా లైసెన్స్డ్ థెరపిస్టులతో కనెక్ట్ చేసే అవకాశాలపై కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది. ఏదిఏమైనా మన సౌకర్యం కోసం మనమే ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీని జ్ఞానయుక్తంగా వినియోగించడం కూడా అవసరమే. మన కంఫర్ట్ కోసం నియమించుకున్న సాధనాలు మనల్ని నాశనం చేసేలా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది.