
బిజెపి మహిళలను గౌరవిస్తుందని పేర్కొంటూ మహిళల పట్ల ఏ పార్టీ అయినా, వ్యక్తులు అయినా అనుచితంగా మాట్లాడినా, ప్రవర్తించినా సహింపదని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా బిజెపి మహిళా నాయకులు విజయవాడ పోలీసు కమీషనర్ కు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చెయ్యాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితా రాజు, బిజెపి రాష్ట్ర మహిళా నాయకురాళ్ళు నిర్మలా కిషోర్, శెనక్కాయల అరుణ, సాలగ్రామ్ లక్ష్మీ ప్రసన్న, బొడ్డు నాగలక్ష్మి, కరి నాగలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, అడ్డూరి శ్రీరామ్, గుడిసే దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?