కాగా, ఆగస్టు నెలలో భారతదేశంలో మొత్తం 268.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని ఐఎండీ తెలిపింది. ఇది సాధారణం కంటే 5 శాతం ఎక్కువ. గత 3 నెలల్లో (జూన్ – ఆగస్టు) మన దేశంలో అత్యధికంగా 743.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వ్యవధిలో సాధారణం కంటే 6 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. అయితే, వాయువ్య భారతదేశంలో ఆగస్టులో 265 మి.మీ వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ నెలలో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.
1901 తర్వాత 13వ అత్యధిక వర్షపాతమని పేర్కొంది. వర్షాకాలంలో మూడు నెలల్లో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. పంజాబ్‌ను దశాబ్దకాలంగా ఎప్పుడు లేనంతగా వరదలు ముంచెత్తాయి. నదులు, కాలువలు గట్లు తెగకపోవడంతో పాటు వేల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రదేశ్; ఉత్తరాఖండ్, జమ్ములలో క్లౌడ్బరెస్ట్లు సంభవించాయి.
దక్షిణ భారతదేశంలో ఆగస్టులో 250.6 మి.మీ వర్షపాతం నమోదవగా, సాధారణం కంటే 31శాతం అధికం. ఇది 2001 తర్వాత మూడవ అత్యధిక వర్షపాతం, 1901 తర్వాత ఎనిమిదవ అత్యధిక వర్షపాతం అని ఐఎండి తెలిపింది. జూన్ 1 నుండి ఆగస్ట్ 31 మధ్య ఈ ప్రాంతంలో మొత్తంగా 607.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 556.2మి.మీ కన్నా 9.3 శాతం లోటుగా పేర్కొంది.
ఆగస్టులో దేశవ్యాప్తంగా 268.1మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇది సాధారణం కన్నా సుమారు 5శాతం అధికమని ఐఎండి వెల్లడించింది. జూన్ నుండి ఆగస్ట్ వరకు మూడు నెలల్లో 743.1మి.మీ వర్షపాతం నమోదు కాగా, సాదారణం కన్నా సుమారు 6 శాతం అధికమని పేర్కొంది.

More Stories
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి
బోండీ బీచ్ లో కాల్పుల దర్యాప్తులో భారత బృందం
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం