
వైజాగ్ నేవీ మారథాస్ 10వ ఎడిషన్ ను డిసెంబర్ 14న ర్వహిస్తున్నామని వైజాగ్ నేవీ మారథాస్ రేస్ ఆర్గనైజర్ కమాండింగ్ ఆఫీసర్ ఇంయేన్ ఎస్ కళింగ కమాండర్ అనిరుద్ రాయ్ తెలిపారు. విశాఖ నగరం రన్నింగ్, క్రీడా ప్రపంచం దిశగా దూసుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఈ మారథస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 2014 నుండి ఈ మారథాన్ ను నిర్వహిస్తున్నామని చెబుతూ ఇందులో పాల్గొనాలనుకునేవారు vizagnavymarathon.run లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు.
ఈ మారథాస్ కు అధికారిక టైటిల్ స్పాన్సర్ గా ఎస్ బి ఐ వ్యవహారిస్తుందని తెలిపారు. ఈ మారథాస్ బీచ్ రోడ్ లోని విశ్వప్రియ ఫంక్షన్ నుండి మొదలై ఐఎన్ఎస్ కళింగ వరకు సాగుతుందని తెలిపారు. జివిని తెలిపారు. ఈ మారథాస్ బీచ్ రోడ్ లోని విశ్వప్రియ ఫంక్షన్ నుండి మొదఎంసి కమీషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ వైజాగ్ నేవీ మారథాస్ లో పాల్గొనే వారి సంఖ్య క్రమేణ పెరుగుతూ వస్తుందని చెప్పా రు. మొదటి ఎడిషన్ 2014 లో 4000 మందితో ఆరంభమైన మారథాన్ 2024 గత ఎడిషన్ 14000 కు చేరుకుందని పేర్కొన్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల తమ ఆరోగ్య పరిరక్షణ , స్నేహ భావం పెంపొందించేందుకు ఈ మారథాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మారథాస్ రిజిస్ట్రేషన్ లను జివిఎంసి కమీషనర్ కేతన్ గార్గ్ అధికారికరికంగా ప్రారంభించారు. ఈ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ సెప్టెంబర్ -1 సోమవారం నుండి అందరికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఐఎన్‌ఎస్ కళింగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వి.కె.తివారీ మాట్లాడుతూ ఈ ఏడాది మారథాన్ కార్యక్రమం నాలుగు రన్స్ క్యాటగిరిలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మారథాన్ రస్ మొదటి కేటగిరి లో పూర్తి మారథాన్ (41.195 కి.మీ), రెండవ కేటగిరి లో సగం మారథాన్ (21.097 కి.మీ) మూడవ కేటగిరి లో (10 కి.మీ) నాలుగవ కేటగిరి లో (5 కి.మీ) ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది 20,000 మందికి పైగా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రతి రన్నర్ కు ఇండియన్ నేవీ తరపున ఇన్సూరెన్సు అందిస్తున్నామని తెలిపారు. ఈ మారథాస్ 18-35 ఏళ్ళ 35-55 ఏళ్ళ వారిని రెండు విభాగాలలో మహిళలు, పురుషులు రెండు కేటగిరీలుగా సాగుతుందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో రేసు డైరెక్టర్ టిఆర్‌ఎస్ కుమార్, నేవీ డిఫెన్స్ పిఆర్‌ఓ కెప్టెన్ సుజిత్ రెడ్డి , ఎస్ బి ఐ డిజిఎం రాహుల్ సంక్రిత్య తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?