ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎఫ్ అధికారి నర్మదేశ్వర్ తివారీ ఓ జాతీయ మీడియా సదస్సులో పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి వివరించారు. అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని ఆయన తెలిపారు. దీంతో దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అందుకు భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలనే ప్రయోగించిందని వెల్లడించారు.
యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే కాని ముగించడం అంత సులువైన పని కాదని ఎయిర్ చీఫ్ నర్మదేశ్వర్ తివారీ తెలిపారు. యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని బలగాలను సంసిద్ధంగా ఉంచామని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ఎదుర్కొనేలా ప్రణాళికలు రచించామని తెలిపారు. ఆపరేషన్ సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పాక్ లక్ష్యాలను 1971 యుద్ధంలో కూడా ఛేదించలేదని పేర్కొన్నారు.
తాము ప్రతి ఆయుధాన్ని లెక్కించామని, అది తమ ప్రణాళిక దారుల సామర్థ్యాన్ని తెలుపుతోందని వివరించారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గట్టి సందేశం పంపామని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి బదులుగా ఏప్రిల్ 29న ఉగ్ర స్థావరాలను షార్ట్‌లిస్ట్ చేసుకున్నామని తెలిపారు.

More Stories
ఒడిశాలో మావోయిస్టు కీలక నేత గణేశ్ తో సహా ఆరుగురు మృతి
హమాస్ నేత హనియాను హత్య ముందు కలుసుకున్న గడ్కరీ!
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!