
తూతూమంత్రంగా అసెంబ్లీని మూడు, నాలుగు రోజులు పెట్టాలని చూస్తున్నారని. ప్రజా సమస్యలపై చర్చించేం దుకు కనీసం 30 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము అడగబోయే సమస్యలకు సమాధానం చెప్పలేక త్వరగా సమావేశాలకు మంగళం పాడాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియింబర్స్‌మెంట్, యూరియా కొరతపై సభలో చర్చ జరగాలని స్పష్టం చేశారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షాల కారణంగా అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని, భారీగా పంట నష్టం వాటిల్లి విపరీతంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 2.20లక్షల ఎకరాల ల్లో వివిధ రకాల పంటలు నాశనం అయ్యాయని చెబుతూ బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీ వర్షాలతో అతలాకుతలమైన జిలాల్లో మంత్రులు పర్యటించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఒకవేళ దేశానికి అన్నం పెట్టే అన్నదాత మీద నిజంగానే శ్రద్ధ ఉంటే ప్రభుత్వం ఒక్క ప్రకటనైనా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర రైతాంగం ఒక భయానక స్థితిలో కొట్టుమిట్టాడుతోందని, ప్రభుత్వం వెంటనే రైతులకు హామీ ఇచ్చే ప్రకటన చేయాలని ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయని ప్రభుత్వం నుండి ఇప్పటివరకు భరోసా ఇచ్చే విధంగా ఒక్క మాట లేదని విమర్శించారు. పంటల భీమా, ఫసల్ భీమా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు ప్రభుత్వం ఇక్కడ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఒక్క రూపాయి కూడా రైతుల పంట నష్టానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వెనువెంటనే పత్తికి ఎకరాకు 50 వేలు, కంది 50 వేలు, సోయాకు 40 వేలు పంట నష్టం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి