
జమ్ముకశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో శనివారంజరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన‘హ్యూమన్ జీపీఎస్’, ‘సమందర్ చాచా’గా పిలవబడే కీలక ఉగ్రవాది బాగూఖాన్ ను భద్రతా బలగాలు హతం చేసాయి. బందిపొరా జిల్లాలోని నౌషెరా నార్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుయత్నం సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో బాగూఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా మరణించాడు, అయితే రెండవ వ్యక్తి గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ సంఘటన భారత భద్రతా బలగాలకు భారీ విజయంగా నిలిచింది. 1995 నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో తలదాచుకున్న బాగూఖాన్, గత 25 సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లోచురుగ్గా ఉన్నాడు. గురెజ్ సెక్టార్‌లోని సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలపై అతనికి ఉన్న లోతైన జ్ఞానం కారణంగా, అతన్నీ హ్యూమన్ జిపిఎస్ గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో 100కు పైగా చొరబాటుయత్నాలకు సహకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్‌గా, అతను ఇతర ఉగ్రవాద సంస్థలకు కూడా సహాయం అందించాడు.ఇది అతన్ని అత్యంత ప్రమాదకరమైన లక్ష్యంగా మార్చింది. జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి అందిన నిఘా సమాచారం ఆధారంగా, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నౌషేరా నార్ IV ప్రారంభించాయి. నౌషెరా నార్ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని గుర్తించిన భద్రతా బలగాలు, వారిని ఆపేందుకు సవాలు విసిరాయి.
ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు దిగడంతో, ఎదురు కాల్పుల్లో బాగూఖాన్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి రెండు మృతదేహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంకా ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు నిఘా సమాచారం సూచిస్తోంది. దీంతో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి తర్వాత, జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఏడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 23 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరిలో 12 మంది పాకిస్థానీయులు, 9 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ అఖల్ వంటి కార్యకలాపాల ద్వారా లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైష్-ఎ-మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో భద్రతా బలగాల విజయాన్ని సూచిస్తున్నాయి.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు