
ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్అత్యంతం వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2038 నాటికి రెండో స్థానానికి చేరుకుంటుందని ఇవై నివేదిక పేర్కొంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఇవై తాజాగా విడుదల చేసిన నివేదికలో, 2030 నాటికి భారతదేశం కొనుగోలు శక్తి సమానత్వం (పిపిపి) 20.7 ట్రిలియన్ డాలర్లకు (రూ.18,13,72,468 కోట్లు) చేరనుంది. ఇది 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్లు దాటి, అమెరికాను అధిగమించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది.
భారత ప్రభుత్వం అనుకూల విధానాలతో అమెరికా సుంకాల ప్రభావం జిడిపిలో 0.1 శాతానికి పరిమితం చేయవచ్చని నివేదిక తెలిపింది. అమెరికా సుంకాల అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించి ఇవై తన నివేదికను రూపొందించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, 202425లో భారత్ జిడిపి (పిపిపి) 14.2 ట్రిలియన్ డాలర్లు, ఇది మార్కెట్ ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రకారం కంటే 3.6 రెట్లు ఎక్కువగా ఉంది.
దీంతో భారత్ ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మార్కెట్ ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రమాణంలో భారత్ 2028 నాటికి జర్మనీని అధిగమించి మూడో స్థానంలోకి రావచ్చని నివేదిక అంచనా వేసింది. ఇవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డి.కె. శ్రీనివాస వ్యాఖ్యానిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునే అంశాల్లో నైపుణ్యంతో కూడిన యువ శ్రామిక శక్తి, తరచూ పెరుగుతున్న పొదుపు, పెట్టుబడి రేట్లు, అనుకూల జనాభా నిర్మాణం ఉన్నాయి.
ఇవి అస్థిర గ్లోబల్ పరిస్థితుల్లో కూడా భారత్‌కి 6.5 శాతం స్థిరమైన వృద్ధిని సాధ్యం చేస్తాయని అంచనా వేశారు. భారత్ తన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి సాంకేతికత, వినూత్న ఉత్పత్తుల్లో సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని, సరైన దిశలో ముందడుగు వేస్తే భారత్ గ్లోబల్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుందని తెలిపారు.
నివేదిక ప్రకారం, అమెరికా సుంకాల వలన భారత్ జిడిపిలో సుమారు 0.9 శాతం ప్రభావం పడవచ్చని, కానీ ప్రత్యామ్నాయ వ్యూహాలు తీసుకుంటే ఇది 0.3 శాతానికి తగ్గవచ్చని, సరైన విధానాలతో దాదాపు 0.1 శాతం (10 బేసిస్ పాయింట్లు) ప్రభావానికే పరిమితం అవుతుందని తెలిపింది. అంటే 202526లో అంచనా వేసిన 6.5 శాతం వృద్ధి రేటు 6.4 శాతానికి తగ్గవచ్చు. గ్లోబల్ వాణిజ్య ఒత్తిళ్లు, అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉన్నప్పటికీ భారత్ తన దేశీయ డిమాండ్, సాంకేతిక సామర్థ్యాలు, స్థిరమైన ఆర్థిక విధానం ఆధారంగా వేగంగా ఎదుగుతోందని ఇవై విశ్లేషణ స్పష్టం చేసింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి