
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ మరో పతకంతో మెరిసింది. మీరాబాయి చాను తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పింది. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న చాను అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన తో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 48 కిలోల విభాగం ఫైనల్లో మీరాభాయి 193 కిలోలు ఎత్తి పసిడి పతకం పట్టేసింది.
వరల్డ్ ఛాంపియన్ షిప్స్‌లో సత్తా చాటాలనుకుంటున్న మీరాకు ఈ విజయం బూస్ట్‌లా ఉపయోగ పడనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన మీరాబాయి ఏడాది కాలంగా వెయిట్ లిఫ్టింగ్‌కు దూరంగా ఉంది. కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ కోసం మళ్లీ బరువులు ఎత్తిన ఆమె తన శక్తికి మించిన ప్రదర్శన కనబరచాలనుకుంది.
తొలి ప్రయత్నంలో 84 కిలోలు ఎత్తిన మీరా రెండోసారి ఏకంగా 109 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది. ‘స్వర్ణ పతకం గెలుపొందండం చాలా సంతోషంగా ఉంది. ఏడాది తర్వాత సొంతగడ్డపై గోల్డ్ మెడల్ సాధించ డం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు కొండంత బలాన్నిచ్చింది. నిరంతర శ్రమ వల్లనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ ఆమె సంతోషం ప్రకటించారు.
`నా కోచ్ సూచనలు, దేశ ప్రజల మద్దతు నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాయి. మరింత ఆత్మవిశ్వాసంతో అక్టోబర్‌లో జరుగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్స్ పోటీలకు సిద్ధమవుతా…’ అని మీరాబాయి తెలిపింది. కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్‌లో ఇదో (193 కి.) రికార్డు. మలేషియాకు చెందిన హెన్రీ (161 కి.) రజతం గెలుచుకోగా వేల్స్ అమ్మాయి నికోల్ రాబర్ట్స్ (150 కి.) కాంస్యం నెగ్గింది. ఇవే పోటీల జూనియ ర్ కేటగిరలో భారత్‌కు చెందిన సౌమ్య దల్వి స్వర్ణం గెలిచింది.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు
సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా