
భారతీయులు అధిక సంఖ్యలో రష్యాకు వస్తుండటంతో రాయబార కార్యాలయంపై పనిభారం కూడా పెరుగుతోందని ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం వచ్చి వెళ్లే వారికి పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకున్నప్పుడు అందించే సేవలు వంటి కాన్సులర్ సేవలు ఎక్కువగా అవసరమవుతున్నాయని చెప్పారు.
ఇలా ఉండగా, ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ఆండ్రీ బెసెడిన్ ఓ భారతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ, “నాకు తెలిసినంతవరకు, ఈ సంవత్సరం చివరి నాటికి, భారతదేశం నుండి 10 లక్షల మంది నిపుణులు రష్యాకు వస్తారు. వాటిలో స్వర్డ్లోవ్స్క్ ప్రాంతం కూడా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించే యెకాటెరిన్బర్గ్లో కొత్త కాన్సులేట్ జనరల్ తెరవబడుతోంది” అని చెప్పారు.
స్వర్డ్లోవ్స్క్, దాని రాజధాని యెకాటెరిన్బర్గ్తో, భారీ పరిశ్రమ, సైనిక-పారిశ్రామిక సముదాయానికి నిలయంగా ఉం. వీటిలో ఉరల్‌మాష్, టి-90 ట్యాంక్ తయారీదారు ఉరల్ వ్యాగన్ జావోడ్ ఉన్నాయి. ఉత్పత్తిని పెంచడానికి ఫ్యాక్టరీలకు ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని బెసెడిన్ తెలిపారు. రష్యాకు వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో ఉపాధి పొందుతున్నారని, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారతీయులకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.
కాగా అధికారిక లెక్కల ప్రకారం రష్యాలో దాదాపు 14 వేల మంది భారతీయులు ఉన్నారు. స్థానిక విద్యాసంస్థల్లో దాదాపు 4,500 మంది మన విద్యార్థులు చదువుతున్నారు. 2024లో భారత కార్మికులు మొదట రష్యన్ ప్రాంతాలకు వచ్చారు, కాలినిన్గ్రాడ్ ఫిష్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ జా రోడినుతో ప్రారంభించారు. ఇక్కడ కార్మికుల కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధానికి తోడు యువ రష్యన్లు ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు విముఖత చూపుతుండటం వంటి కారణాలతో 2030కల్లా రష్యాలో 31 లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడనున్నట్లు అంచనా.
ఈ నేపథ్యంలో ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక కొరతను తీర్చడానికి ఈ ఏడాది చివరికల్లా నిపుణులైన 10 లక్షల మంది భారతీయ కార్మికులను తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావిస్తున్నట్లు ఈ మధ్య వార్తా కథనాలు వెలువడ్డాయి. శ్రీలంక, ఉత్తర కొరియా నుండి వచ్చే కార్మికులను రష్యా పరిశీలిస్తోందని బెసెడిన్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియను “చాలా సంక్లిష్టమైనది” అని ఆయన అభివర్ణించారు.
భారతీయ కార్మికులను నియమించుకునే చర్య దీర్ఘకాలిక శ్రామిక శక్తి అంతరాలను పరిష్కరిస్తూనే అత్యంత ప్రత్యేక రంగాలలో పారిశ్రామిక ఉత్పత్తిని కొనసాగించే విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు వలసలపై ఆంక్షలు విధిస్తున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్- రష్యా మధ్య ఎప్పటినుంచో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో భారతీయులకు ఉపాధి అవకాశాలు పెరగడం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం