
యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించటం సంతోషంగా ఉందంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కెరీర్లో తండ్రి వారసత్వాన్ని కాపాడటంతోపాటు తన అద్భుత నటనతో, కళపట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్రవేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతోపాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషన్ కూడా ఈ ఏడాదే అందుకున్నారు.
1974లో తాతమ్మ కలతో బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైంది. అలా 50 ఏళ్ల కెరీర్లో బాలయ్య మంగమ్మగారి మనవడు, సీతారామకల్యాణం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్, శ్రీ రామరాజ్యం, అఖండ, భగవంత్ కేసరి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ అన్ని జాన్రాలలో నటుడిగా సత్తా చాటారు.
కెరీర్లో అనేక విజయాలు అందుకున్నారు. ఇందులో బోయపాటి శ్రీనివాస్ తెరెక్కించిన లెజెండ్ సినిమా 1000కి పైగా రోజులు థియేటర్లలో ప్రదర్శితమై అరుదైన ఘతన సాధించింది. బాలకృష్ణ హీరోగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీసెంట్గా నేషనల్ అవార్డ్ వరించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్‌తో వచ్చింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది.
తన తండ్రికి అరుదైన గౌరవం దక్కటం పట్ల నారా బ్రహ్మణి ఎక్స్ వేదికగా సంతోషం ప్రకటించారు. ఆన్ స్క్రీన్‌పై ఐకాన్‌గా నిలవటంతోపాటు ఆఫ్ స్క్రీన్‌లో గొప్ప లీడర్‌గా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు గ్లోబల్ గౌరవం దక్కటం సంతోషంగా ఉందంటూ బాలయ్యకు బ్రహ్మణి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన