
ఈ దాడి వెనుక అతని ఉద్దేశం ఢిల్లీలో వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆగ్రహమే కారణమని పోలీసులు తెలిపారు. సక్రియా, సీఎం రేఖా గుప్తా తన విజ్ఞప్తులను పట్టించుకోలేదని ఆగ్రహంతో ఈ దాడికి పూనుకున్నట్లు చెప్పాడు. సక్రియా మొదట సుప్రీంకోర్టు వద్ద నిరసన తెలపాలని భావించాడు. కానీ అక్కడి భద్రత కారణంగా వెనుదిరిగాడు.
బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా అతను ఆమె దగ్గరికి వచ్చి కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
రాజేశ్ సక్రియా ఒక ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, కుక్కల పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని తల్లి భాను సక్రియా ప్రకారం, అతను మానసికంగా అస్థిరంగా ఉంటాడని, సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర ఆగ్రహంతో ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. సక్రియాకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 2017 నుంచి 2024 మధ్య ఏడు నుంచి పది క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో అక్రమ మద్యం రవాణా, దాడి, క్రిమినల్ భీషణి వంటి ఆరోపణలు ఉన్నాయి.
అతను ఆగస్టు 17న ఉజ్జయిని నుంచి ఢిల్లీకి రైలులో బయలుదేరాడు. ఆగస్టు 19న సీఎం నివాసం సమీపంలోని గుజరాతీ సమాజ్ గెస్ట్‌హౌస్‌లో బస చేశాడు. దాడికి ముందు రోజు, సీఎం షాలిమార్ బాగ్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించి, వీడియోలు రికార్డ్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలింది.
ఈ కేసులో రాజేశ్ సక్రియా స్నేహితుడు తహసీన్ సయ్యద్‌ను రాజ్‌కోట్ నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. తహసీన్ దాడికి ముందు సక్రియాకు రూ. 2,000 ఆన్‌లైన్ ద్వారా పంపాడని, ఇద్దరూ నిరంతరం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని పోలీసులు గుర్తించారు. సక్రియా, సీఎం నివాసం వీడియోను తహసీన్‌కు పంపినట్లు కూడా వెల్లడైంది. తహసీన్‌పై క్రిమినల్ కుట్ర, హత్యాయత్నానికి సహకరించిన ఆరోపణలతో కేసు నమోదైంది.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం