
ఈ ప్రయోగం గగన్‌యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి, దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాచూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజా పరీక్షను నిర్వహించారు.
ఈ పరీక్ష ద్వారా పారాచూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక ప్రయోగం ఇస్రో ఒక్కదానితో మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ రక్షణ, పరిశోధనా సంస్థల సమష్టి కృషితో సాధ్యమైంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్), డీఆర్‌డీవో, భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) ఈ పరీక్షలో ఇస్రోతో కలిసి పాలుపంచుకున్నాయి.
ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. కాగా గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి, తిరిగి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ముందుకు సాగుతోంది.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు