
అనేక ఏళ్లుగా అభివృద్ధి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని యువత పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంటూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. డ్రగ్స్ మాఫియా పెరిగిందని, శాంతి భద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.
ఇటువంటి పరిస్థితుల్లో యువతను మంచి దారిలో తీసుకెళ్లే బాధ్యత బిజెపి యువమోర్చాకు ఉందని చెబుతూ మన లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించడం అని స్పష్టం చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1000 మంది యువత మార్పు కోసం సంకల్పం తీసుకొని పని చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వం రాకముందు, భారతదేశానికి ఒలింపిక్స్‌లో చాలా తక్కువ పతకాలు వచ్చేవని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించి, భారత్‌ను విజయ పథంలో నిలిపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
దేశ యువత జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ గివర్స్‌గా ఎదగాలని స్టార్టప్ ఇండియా, ముద్ర లోన్ వంటి పథకాలు ప్రారంభించారని చెప్పారు. అయితే,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందని, కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, లక్ష ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని పేర్కొంటూ నిరుద్యోగ భృతి ఎక్కడ? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు.
“తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు, కాని ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. నిజమైన అభివృద్ధి కోసం, గొప్ప మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ఈ సందర్భంగా పిలుపిచ్చారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం