
రాబోయే రోజుల్లో మనదేశ వ్యోమనౌకల, మన దేశ రాకెట్ ద్వారా మన దేశ వ్యోమగామి.. అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష కేంద్ర అనుభవం వెలకట్టలేనిదని, అక్కడ ఎంతో నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తున్నదని చెప్పారు. 1984లో ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ చెప్పినట్లు సారే జహాసే అచ్చా అన్న రీతిలోనే ఇండియా ఇప్పటికీ ఉన్నట్లు శుక్లా తెలిపారు.
డిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంతరిక్ష యాత్ర అనుభవాలను పంచుకుంటూ “యాక్సియం-4 మిషన్‌లో భాగంగా గతేడాదిలో నేర్చుకున్న పాఠాలు, భారత్ గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో ఉపయోగపడతాయి. ఎంత శిక్షణ తీసుకున్నా, రాకెట్లో కూర్చొనప్పుడు కలిగే అనుభూతి పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజానికి మొదటి కొన్ని సెకన్ల పాటు రాకెట్ వెనక పరిగేత్తుతున్నట్టే అనిపించింది. దానిని అందుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది” అని తెలిపారు.
శిక్షణ పొందిన దాని కన్నా ఎక్కువగా మానవ అంతరిక్ష మిషన్‌ను హ్యాండిల్ చేయాల్సి వస్తుందని, ఆ మిషన్‌లో భాగం కావడం వల్ల వచ్చే జ్ఞానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. గగన్‌యాన్‌తో పాటు భారతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో తన అభవనం కీలకం కానున్నట్లు చెప్పారు. తొందరలోనే మన క్యాప్సూల్ నుంచి మన రాకెట్ ద్వారా మన దేశ వ్యోమగామి అంతరిక్షం వెళ్తారని తెలిపారు. గ్రౌండ్లో పనిచేసిన అనుభం చాలా భిన్నంగా ఉంటుందన్నారు.
More Stories
బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు