తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్
 
భారతదేశంతో నిత్యం పోరాడేందుకు ప్రయత్నించే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. భారత్ పై యుద్ధానికి దిగిన పాక్ రక్షణ ఆయుధాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నది. దీనికి తోడు సింధునది నీటి విడుదలను భారతదేశం ఆపి వేయడంతో రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఒకవైపు తీవ్రమైన వర్షాలు, మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలుఅల్లాడుతున్నారు.
భారత విమానాలను పాక్ గగనతలంపై అనుమతిని ఇవ్వకపోవడంతో విమానాసంస్థలకు ఖర్చు విపరీతంగా పెరిగింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ జనాభాలో దాదాపు సగం మంది, 44.7 శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం ఆదేశ దయనీయ పరిస్థితులను తెలుపుతున్నది. 
 
రాజకీయ, ఆస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ఆర్థిక దివాళాతనానికి దారితీస్తున్నది. పాకిస్తాన్ 2022లో 1,766 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం, 2023 నాటికి 1,568 డాలర్లకు పడిపోయింది. అంటే, ఏడాది కాలంలో 11.38శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా 375 బిలియన్ డాలర్ల నుంచి 341.6 బిలియన్ల డాలర్లకు  తగ్గిపోయింది. 
అంతేకాదు ప్రజలను ద్రవ్యోల్బణం కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. ప్రాంతీయ విబేధాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచాయి. ప్రపంచ బ్యాంకు చేస్తున్న ఆర్థిక సాయం కూడా పాకిస్తాన్ ప్రజల అవసరాల కోసం కాకుండా రక్షణ రంగాలకే కేటాయిస్తున్నది. భారత్- పాక్ యుద్ధం కూడా పాకిస్తాన్ ఆర్థికంగా కొలుకోకుండా అయ్యింది. దీంతో దాదాపు 44 శాతం మంది పేదరికంలోనే జీవిస్తున్నారు.