
గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికను ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఆమోదించారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు సుమారు 60,000మంది ప్రత్యేక సైన్యాన్ని రప్పించేందుకు అధికారం ఇచ్చారని ఆయన మంత్రిత్వ శాఖ ప్రతినిధి బుధవారం ధృవీకరించారు. గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న అమానుష యుద్ధంలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు తమ తాజా ప్రతిపాదనపై ఇజ్రాయిల్ అధికారిక ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్న సమయంలోరక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చర్య హమాస్‌పై ఒత్తిడిని మరింత పెంచిందని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ముసాయిదాతో సుమారు 50,000 మంది సైనికులను పిలిపిస్తామని ఒక సైనిక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు. దాడి తదుపరి దశలో గాజాలో పనిచేసే ప్రధాన దళాలు గాజా నగరంపై దృష్టి సారించే చురుకైన విధుల దళాలుగా ఉంటాయని తెలిపారు. ప్రణాళిక ప్రారంభ దశలో భాగంగా గాజా నగరంలోని జైటౌన్ మరియు జబాలియా పరిసరాల్లో సైన్యం ఇప్పటికే విస్తరించిందని చెప్పారు.
ఒప్పందం ఏదైనప్పటికీ బందీలందరినీ విడుదల చేయలనే తన పిలుపుపై ప్రభుత్వం ధృఢంగా ఉందని ఇజ్రాయిల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రణాళికపై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ బహిరంగంగా స్పందించలేదు. అయితే గతవారం ”బందీలందరినీ ఒకేసారి విడుదల చేసే ఒప్పందాన్ని మరియు మా షరతుల ప్రకారం యుద్ధాన్ని ముగించడానికి ” తమ దేశం అంగీకరిస్తుందని పేర్కొన్నారు.
More Stories
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’