
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. 1946 జులైలో జన్మించిన ఆయన, 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు.
1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవ్వగా 2005లో గువాహటి హైకోర్టు సీజేగా పని చేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించిన ఆయన, 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టారు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. హైద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ బోర్టర్ ఆప్ ట్రస్ట్రీగా కూడా ఆయన సేవలందించారు.
అంతకుముందు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన ఎన్డీయే, ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది.
మోదీ తన ప్రసంగంలో వివిధ పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు, రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసుకోవడానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితాన్ని కొనియాడారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఎలాంటి వివాదాలకు లేదా కళంకాలకు దూరంగా సరళమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నిక మొత్తం దేశానికి ఆనందదాయకమైన విషయమని తెలిపారు.
More Stories
డిసెంబర్ 5- 6 తేదీల్లో భారత్‌కు పుతిన్
దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన