
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ లో ట్రంప్‌తో అలాస్కాలో జరిగిన సమావేశం గురించి వివరించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పుతిన్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు. ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి సమాచారాన్ని తెలియజేసినందుకు పుతిన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని, రాబోయే రోజుల్లో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో కాల్పుల విరమణపై చర్చించారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అమలుపై ఏకాభిప్రాయానికి రాలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన సమయంలో సమావేశం జరిగింది. సుంకాలపై భారత్ తీవ్రంగా అభ్యంతరం చేస్తూ అగ్రరాజ్యం చర్యలు అన్యాయం, అసంబద్ధమని పేర్కొంది. అయితే, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు, ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణలను పరిశీలిస్తే అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రష్యా భారత్‌తోనే ఉందని స్పష్టంగా తెలుస్తున్నది. పుతిన్-ట్రంప్ సమావేశం భారత్‌పై ప్రభావం అసంపూర్ణంగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారత్‌పై తాను విధించిన 25 శాతం అదనపు సుంకం ప్రభావం కనిపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు.
పుతిన్-ట్రంప్ మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోతే.. భారత్ మరిన్ని సుంకాలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో అలాస్కా సమావేశం తర్వాత భారతదేశం అతిపెద్ద ఎగుమతి కేంద్రం (అమెరికా)తో వాణిజ్య వివాదం మరింత కొనసాగే అవకాశం ఉంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ప్రశ్నకు సమాధానంగా భారత్‌పై మరిన్ని సుంకాలు విధించాల్సి వస్తే.. తాను ఖచ్చితంగా చేస్తానని, అలా చేయాల్సిన అవసరం లేకపోవచ్చునని పేర్కొన్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక