
లోక్‌సభ సోమవారం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025. అయితే, ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు లోక్ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే, తాను ‘నిర్ణయాత్మక నిర్ణయం’ తీసుకోవలసి ఉంటుందని స్పీకర్ హెచ్చరించారు. “మీరు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, నేను కొన్ని నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దేశ ప్రజలు మిమ్మల్ని చూస్తారు. అనేక అసెంబ్లీలలో ఇటువంటి ఘటనలకు సభ్యులపై చర్యలు తీసుకున్నారు. నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది మీకు నా అభ్యర్థన” అని బిర్లా వారించారు.
సోమవారం సభ ప్రారంభం కాంగానే ముందుగా, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) సభ్యులు త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా పార్లమెంటు ప్రాంగణంలో తమ నిరసనను కొనసాగించారు. ఆదివారం ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలపై స్పష్టత ఇచ్చినప్పటికీ ఇండియా కూటమి సభ్యులు నిరసన కొనసాగిస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో స్పీకర్ పై విధంగా స్పందించారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం