
“కొన్ని పార్టీలు, వాటి నాయకుడులు బిహార్ ఎస్ఐఆర్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. బిహార్ ముసాయిదా ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలను వ్యక్తం చేయాలని ఈసీ కోరుతోంది. దీనికి ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఎన్నికల కమిషన్ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి” అని చెప్పారు.
“బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు అందరూ అత్యంత పారదర్శకంగా కలిసి పనిచేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపదు. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటినీ ఎన్నికల కమిషన్ సమానంగా చూస్తుంది. 45 రోజుల్లో ఎలాంటి ఎన్నికల పిటిషన్లు వేయకుండా, కేవలం ఓటు చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తుండడం రాజ్యాంగాన్ని అవమానించడమే”అని తెలిపారు.
గత రెండు దశాబ్దాలుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అందు కోసమే ఎన్నికల సంఘం బిహార్ నుంచి ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను ప్రారంభించిందని చెప్పారు. సర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల మంది బీఎల్‌ఏలు కలిసి ముసాయిదా జాబితాను సిద్ధం చేశారని వివరించారు
కాగా, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లోని ససారం నగరంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ప్రారంభించారు. ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బీహార్‌లో ఓట్ల తొలగింపు, చేర్పుల లాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. అయితే ఆ కుట్రను ఇండియా కూటమి కచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం