
2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటివరకు సుమారు 184మంది పాలస్తీనియన్ జర్నలిస్టులు మరణించారు. జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతులు మంది ఇజ్రాయిల్ వైమానిక దాడుల కారణంగానే మరణించినట్లు జర్నలిస్టుల హక్కులను పరిరక్షించే స్వతంత్ర సంస్థ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సిపిజె) తెలిపింది. ఆగస్ట్10న గాజాస్ట్రిప్‌లోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలోని ఒక శిబిరంలో అల్‌జజీరా మీడియా సిబ్బందిపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు జర్నలిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
వీరిలో అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ ఖ్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మొహమ్మద్ నౌఫాల్‌లు నలుగురు అల్‌జజీరా సిబ్బంది. మోమెన్ అలివా, మొహమ్మద్ అల్-ఖల్లి అనే మరో ఇద్దరు జర్నలిస్టులు మరణించారు. శిబిరంపై ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగానే నిర్వహించిందని హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు పేర్కొన్నారు. అనాస్ అల్-షరీఫ్‌ను హమాస్ అనుబంధ ఉగ్రవాదిగా ముద్రవేసి దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడిలో మరో ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారని పేర్కొన్నారు.
2023 నుండి హత్య కావించిన పాలస్తీనియన్ జర్నలిస్టుల సంఖ్య ప్రపంచంలో చంపిన మొత్తం జర్నలిస్టుల సంఖ్య కంటే అధికంగా ఉంది. 2025 ఆగస్ట్ 12 నాటికి, ఇజ్రాయిల్- గాజా యుద్ధం కారణంగా 192 మంది జర్నలిస్టులు మరణించారు. వారిలో 184 (96శాతం) పాలస్తీనియన్లు, 2 (1శాతం) ఇజ్రాయిలీయులు, 6 (3శాతం) లెబనాన్ జర్నలిస్టులు ఉన్నారు.
జర్నలిస్టులను హత్య చేయడానికి ఎటువంటి విశ్వసనీయమైన రుజువును అందించకుండానే వారిని ఉగ్రవాదులుగా నిందించడం అనే నమూనాను దశాబ్దాలుగా ఇజ్రాయెల్ అనుసరిస్తుంది. ఆగస్టు 10 దాడుల తర్వాత డజను మంది పాలస్తీనియన్ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని సిపిజే కొత్త ఆన్‌లైన్ ఇజ్రాయెల్ దుష్ప్రచారాలను చురుకుగా పరిశీలిస్తోంది. పాలస్తీనియన్ జర్నలిస్టులు #NotATarget — వారు గాజాలో ప్రపంచానికి కళ్ళు, చెవులు.
జర్నలిస్టుల హత్యల పట్ల అంతర్జాతీయ సమాజం చాలా కాలంగా మౌనంగా ఉందని పేర్కొంటూ ఈ దురాగతాలను అంతం చేయడానికి తక్షణ చర్య తీసుకోవాలని సిపిజే కోరింది. అంతర్జాతీయ మీడియాకు గాజాకు స్వతంత్ర ప్రాప్యతను మంజూరు చేయాలని, సెన్సార్‌షిప్ లేదా హత్యకు భయపడకుండా పత్రికలు నివేదించడానికి అనుమతించాలని, ఇజ్రాయెల్‌ను జవాబుదారీగా ఉంచాలని సిపిజే వారిని కోరుతోంది.
More Stories
`బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఫ్రాన్స్ లో పెద్దఎత్తున నిరసనలు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం